నర్సింగ్ విద్యార్థినులపై కళాశాల ఛైర్మన్ లైంగిక వేధింపులు

K Sai Trinath, News18, Vijayawada

విజయవాడ (Vijayawada) అంబాపురం గ్రామంలో ఇన్స్టిట్యూట్ అఫ్ ఫార్మామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ కళాశాల చైర్మన్ రవీంద్ర రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆందోళకు దిగారు. భద్రాచలం, నూజివీడు, విస్సన్నపేట, తిరువూరు ప్రాంతాలకు చెందిన సుమారు 86మంది విద్యార్థినులు ఇక్కడే హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. కాలేజీకి ప్రిన్సిపాల్, ఛైర్మన్ అయిన రవీంద్రారెడ్డి నిత్యం తమను వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు విద్యార్థినిలు తెలిపారు. నిత్యం ఏదో వంకతో దగ్గరకు రావండం, అసభ్యంగా ప్రవరిస్తున్నట్లు వాపోయారు. స్పెషల్ క్లాసులున్నాయంటూ రాత్రి 11గంటలకు రమ్మంటున్నాడని.. అదేంటని అడిగి , అడిగితేనాకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు తరగతులు నిర్వహిస్తాను అని రవీంద్రారెడ్డి చెప్పేవాడని విద్యా్ర్థినులు వాపోయారు.

పాఠాల పేరుతో ఒంటిపై చేతులు వేస్తూ అసభ్యకరంగా మాటలు మాట్లాడుతూ ప్రవర్తిచేవాడని విద్యార్ధినులు తెలిపారు. ఆరోగ్యం బాగోకపోయిన, ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడనిచ్చేవాడు కాదని, ఇంటర్నల్ మార్క్స్ ఉండటంతో తమ భాదను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కుమిలిపోయేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం సీనియర్ విద్యార్థిని లైంగికంగా వేధించినప్పుడే కాలేజీని వదిలి వెళ్లిపోదామనుకున్నామని.. ఈ మధ్య వేధింపులు ఎక్కువయ్యాయని విద్యార్థినులు ఆరోపించారు.

ఇది చదవండి: ఉపాధి హామీలో అవకతవకు.. వీళ్ల చేతివాటం మాములుగా లేదుగా..!

విద్యార్థినుల ఆందోళనకు పలు ప్రజాసంఘాలు మద్దతిచ్చాయి. పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి. పద్మ, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షలు, కార్యదర్శలు రవిచంద్ర, రాజేషులు భాధితులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు.రవీంద్రారెడ్డిపై పొక్సో కేసును నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు. కొందరు విద్యార్ధినులు ధ్రువపత్రాలను తీసుకొని ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు.ఘటనపై సీఐ సుబ్రహ్మణ్యం వివరణ కోరగా...ఓ విద్యార్థిని పిర్యాదు మేరకు కేసును నమోదు చేసి విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్, చైర్మన్ రవీంద్రారెడ్డిని కస్టడిలోకి తీసుకున్నట్టు తెలిపారు.

2023-06-08T03:01:57Z dg43tfdfdgfd