నలుగురితో ఎఫైర్.. కూతురు వయసున్న అమ్మాయితో పెళ్లి.. ఈ స్టార్ జీవితమంతా వివాదాలే..!

ఆయన సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగారు. 1970ల్లో తిరుగులేని తారగా ఖ్యాతి గడించారు. ఖూన్ భరీ మాంగ్', 'మై హూన్ నా', 'కచ్చా ధాగే', 'తాజ్ మహల్', 'కైట్స్', 'బ్లూ' వంటి బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించారు. బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. ఆయన మరెవరో కాదు.. కబీర్ బేడీ..! తెరపై అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన వ్యక్తిగత జీవితం కూడా.. సినిమా కథలాగే చాలా స్పైసీగా ఉంటుంది. కబీర్ బేడీ నిజ జీవితంలోనూ చాలా రొమాంటిక్‌గా ఉండేవారు. దానివల్ల ఎన్నో ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చింది. మూడు వివాహాలు విఫలమైన తర్వాత.. తన 70వ పుట్టినరోజున కంటే.. 30 ఏళ్లు చిన్నదైన మోడల్ పర్వాణి దోసాంజ్‌‌ను వివాహం చేసుకున్నారు.

---- Polls module would be displayed here ----

కబీర్ బేడీ.. 1946 జనవరి 16న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 78 ఏళ్లు. 1971 నుంచి సినీ ప్రపంచంలో క్రియాశీలకంగా ఉన్న కబీర్ బేడీ.. 60కి పైగా చిత్రాల్లో నటించారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఆయన సీనియర్ నటుడు. అనేక హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. తన బలమైన గాత్రంతో పాటు, అద్భుతమైన వ్యక్తిత్వానికి కూడా ప్రసిద్ధి చెందారు. ఐతే సినిమాల కంటే, తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా వార్తల్లో ఉన్నారు. కబీర్ బేడీ మొత్తం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు.

కబీర్ బేడీ మొదట 1969లో డ్యాన్సర్ ప్రోతిమా బేడీని వివాహం చేసుకున్నారు. వీరికి పూజా బేడీ, కుమారుడు సిద్ధార్థ్ ఉన్నారు. పిల్లలు పుట్టాక కూడా ఈ వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. కబీర్ నుంచి విడిపోయిన తర్వాత కబీర్ లాంటి వ్యక్తిని ప్రేమించలేనని ప్రోతిమా ఎప్పుడూ చెప్పింది. సిద్ధార్థ్ ఆత్మహత్య తర్వాత ప్రోతిమా కూడా యాక్సిడెంట్ లో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది.

పర్వీన్ బాబీ కారణంగానే ప్రోతిమా, కబీర్‌ల వివాహం బంధం క్షీణించింది. అలాగని పర్వీన్‌తో బంధం పెరగలేదు. ప్రొతిమాకు విడాకులు ఇచ్చిన తర్వాత.. బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ హంఫ్రీస్‌తో ఎఫైర్ పెట్టుకున్నారు కబీర్ బేడీ. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సుసానే, కబీర్ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఈ వైవాహిక బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో విడాకులు తీసుకున్నారు.

బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ హంఫ్రీస్‌తో విడిపోయిన తర్వాత కబీర్ 1990వ దశకంలో టీవీ, రేడియో ప్రెజెంటర్ నిక్కీని మూడోసారి వివాహం చేసుకున్నారు. ఇది కూడా నిలవలేదు. 15 ఏళ్ల వైవాహిక బంధం తెగిపోవడంతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నాలుగో పెళ్లి కూడా చేసుకున్నారు. కబీర్ బేడీ తన 70వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు ప్రియురాలు పర్వీన్ దోసాంజ్‌ను వివాహం చేసుకున్నారు. బ్రిటీష్ నటి, మోడల్, సినీ నిర్మాత అయిన పర్వీన్ దాదాపు పదేళ్ల పాటు కబీర్‌తో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలో ఒంటరిగానే ఉంటున్నారు.

2024-04-23T09:24:38Z dg43tfdfdgfd