నా బాడీ సూప‌ర్‌ డీల‌క్స్ అంటూ అషు రెడ్డి.. అసలైన మజా అంటే ఇదే..!

బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి (Ashu Reddy) ఇక సినీ తెరపై కనిపించబోతోంది. తాజాగా ఆమె నటించిన యేవమ్ మూవీ నుంచి ఓ ఖతర్నాక్ హాట్ పోస్టర్ రిలీజ్ చేశారు. రోటిన్ పాత్ర‌ల‌కు భిన్నంగా కొత్త పాత్ర‌ల్లో న‌టించిన‌ప్పుడే కెరీర్‌లో కిక్ ఉంటుంది. స‌రిగ్గా అలాంటి ఓ డిఫ‌రెంట్ అండ్ బోల్డ్, హాట్ పాత్ర‌లో త్వ‌ర‌లో యేవ‌మ్ చిత్రంలో కనిపించనుంది అషు రెడ్డి. తాజాగా విడుదల చేసిన ఆమె హాట్ లుక్ స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తోంది.

ఈ సినిమాలో హారిక అనే ముఖ్య‌పాత్ర‌లో నటిస్తోంది అషు. నా బాడీ సూప‌ర్‌డీల‌క్స్ అంటూ ఆఘ‌రెడ్డి కిక్ ఇచ్చే పాత్ర‌లో ఎందుకు క‌నిపించ‌బోతున్నారు తెలియాలంటే యేవ‌మ్ విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మహిళా సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుందట. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ఇటీవ‌ల విడుద‌ల చేసిన చాందిని చౌద‌రి పోస్ట‌ర్‌లో ఉన్న 'ఆడపిల్లని అయితే ఏంటంటా? అనే రైట‌ప్ అంద‌ర్ని ఆలోచింప‌జేసింది. ఇప్పుడు అషు రెడ్డి నా బాడీ సూప‌ర్ డీల‌క్స్ అని ఎందుకు అంటుంది. ఇలా ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ ఉంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషు రెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

2024-05-03T10:34:01Z dg43tfdfdgfd