నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్​కుమార్​రెడ్డి

నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్​కుమార్​రెడ్డి

  • కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి

యాదాద్రి, వెలుగు : ఎంపీగా ఉన్న సమయంలో బూర నర్సయ్యగౌడ్​ తెచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని భువనగిరి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి డిమాండ్​ చేశారు. శుక్రవారం భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను తెచ్చానని చెప్పుకుంటున్న రూ.9 వేల కోట్లు ఏఏ పనులకు ఖర్చు చేశారో బూర చెప్పాలన్నారు. తన వ్యాపారం కోసం ఎయిమ్స్​రాకుండా చేసేందుకే ఆయన ప్రయత్నించారని ఆరోపించారు.

2014 విభజన చట్టం ప్రకారం ఎయిమ్స్​వచ్చిందని తెలిపారు. ఎన్నికల్లో కులం, మతం అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా ఉన్నప్పుడు నిధుల సాధన కోసం ఎన్నడూ ప్రయత్నం చేయలేదన్నారు. తెలంగాణ సొమ్మును కేసీఆర్​ దోచుకుంటుంటే.. ప్రధాని మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. పదేండ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని

గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో డెవలప్​ చేస్తానని తెలిపారు. ఆయన వెంట భువనగిరి మున్సిపల్​చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నాయకుడు తంగెళ్ల పల్లి రవికుమార్​ తదితరులు ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T05:37:50Z dg43tfdfdgfd