పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో షాకయ్యా: నటుడు నరేశ్

మిస్టర్ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సూపర్ స్టార్ స్వర్గీయ కృష్ణ గారిని విమర్శించడం చూసి షాక్ అయ్యాను మరియు చాలా బాధపడ్డాను. 

అలనాటి హీరో, సూపర్ స్టార్ దివంగత కృష్ణపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయటం సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్‌ను కృష్ణ రాజకీయంగా విభేదించారని పవన్ అన్నారు. అయినా, కృష్ణ చిత్రాలకు ఎన్టీఆర్ ఏనాడు ఇబ్బందులు కలిగించలేదని చెప్పారు.   సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి ప్రస్తావిస్తూ చేసిన కొన్ని కామెంట్లు పరోక్షంగా కృష్ణ అభిమానులను బాధ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీకే నరేష్ తాజాగా ఒక సందర్భంలో సోషల్ మీడియా ద్వారా పవన్ చేసిన కామెంట్ల గురించి స్పందించారు.

 కృష్ణగారి (Krishna) విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ బాధ పెట్టాయని ఆయన తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణగారిది బంగారు మనసని ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేశారని నరేష్ (Naresh) చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి కృష్ణగారు చేసిన సేవలు మరవలేనివని ఆయన అన్నారు. కృష్ణగారు ఎప్పుడూ పొత్తులు మారలేదని ఈ సందర్భంగా సీనియర్ నరేష్ గుర్తు చేశారు.

 

వ్యక్తిగతంగా కృష్ణ ఎవరినీ విమర్శించలేదని నరేష్ తన కామెంట్స్ ద్వారా చెప్పుకొచ్చారు. యాక్టర్ గా, పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ ను నేను ఎంతగానో అభిమానిస్తానని ఏపీ భవిష్యత్తుగా పవన్ కళ్యాణ్ ను నేను చూస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.

ఈ ఎన్నికల్లో పవన్ గెలిచి, కూటమి గెలిచి ఆంధ్రప్రదేశ్ మళ్లీ వెలుగు వెలగాలని ఫీలవుతున్నానని వీకే నరేష్ పేర్కొన్నారు. జై శ్రీరామ్ అంటూ వీకే నరేష్ కామెంట్లు చేయడం గమనార్హం. 

దివంగత నటుడు కృష్ణగారి పేరును అనవసర వివాదాల్లోకి లాగవద్దని నెటిజన్లు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కావాలని విమర్శలు చేయలేదని ఆయన వ్యాఖ్యల వెనుక కృష్ణగారి స్థాయిని తగ్గించాలనే ఆలోచన అస్సలు లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతున్నారు.

అసలు పవన్ మాటలు ఇని,, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర నటులు వేరే పార్టీలలో ఉన్నారు. అలానే అప్పటి సూపర్ స్టార్ కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారిని కృష్ణ గారు ఎంతగా విమర్శించినా ఎన్టీఆర్ గారు తిరిగి ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. అది ఎన్టీఆర్ గారి అంతటి సంస్కారం. అయితే ప్రస్తుత సీఎం జగన్ మాత్రం నన్ను వేధింపులకు గురి చేశారని అన్నారు.

ఇక ఈ వ్యాఖ్యలు ఇటీవల ఎంతో దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యల్లో కృష్ణ గారిని పవన్ ఎక్కడా విమర్శించలేదని పలువురు జనసేన నాయకులు, పవన్ ఫ్యాన్స్ అంటే, ఎన్నికల వేళ నాటి సూపర్ స్టార్ కృష్ణ గారిని లాగవలసిన అవసరం పవన్ కు ఏమిటనేది కృష్ణ గారు, మహేష్ ఫ్యాన్స్ ప్రశ్నించారు.  

పవన్ కళ్యాణ్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పొలిటికల్ గా పవన్ రేంజ్ పెరుగుతోంది. పవన్ తాజాగా మరో జనసేన అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో డ్యాన్స్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. 

సూపర్ స్టార్ కృష్ణ కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పని చేశారు. 1989 ఎన్నికల్లో ఏలూరు నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఆయన గెలుపొందారు. ఆ సమయంలో తెలుగు దేశం అధినేతగా ఉన్న ఎన్టీఆర్‌ను రాజకీయంగా ఆయన విభేదించారు.

2024-04-25T03:56:39Z dg43tfdfdgfd