పిల్లల్ని కనేందుకు మెహ్రీన్ సంచలన నిర్ణయం.. ఇప్పట్లో పెళ్లి చేసుకోదా..

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. చివరగా ఎఫ్3 చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. అవసరమైన మేరకు గ్లామర్ ఒలకబోస్తూ యువతలో గుర్తింపు తెచ్చుకుంది మెహ్రీన్. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఎలాంటి టాలీవుడ్ చిత్రం లేదు. 

అయితే అప్పుడప్పుడూ మెహ్రీన్ వార్తల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెహ్రీన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లోకెక్కింది. ఇటీవల సెలెబ్రిటీలు ఎక్కువగా ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుతున్నారు. పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకుంటే ఆరోగ్యకరమైన అండాలని దాచుకునే విధానం ప్రాధాన్యత పొందుతోంది. 

ప్రస్తుతం వైద్య పద్ధతులు, టెక్నాలజీ ద్వారా అది సాధ్యం అవుతోంది. 30 ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనాలనుకుంటే సమస్యలు తలెత్తుతున్నాయి. అలా జరగకుండా ఆడవారు తమ ఆరోగ్యకరమైన అండాలని దాచుకుని తాము ఒకే అనుకున్నప్పుడు పిల్లల్ని కనొచ్చని ఎగ్ ఫ్రీజింగ్ కి వెళుతున్నారు. 

ఇటీవల ఈ విధానం గురించి మృణాల్ ఠాకూర్ తెలిపింది. తాజాగా మెహ్రీన్ చేసి చూపించింది. తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్న తర్వాత ఆ దృశ్యాలని మెహ్రీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎగ్ ఫ్రీజింగ్ కోసం రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తుంటే ఇప్పటికి పూర్తి చేయగలిగానని మెహ్రీన్ తెలిపింది. తల్లి కావడం నా కల. కానీ అది ఆలస్యం కావచ్చు. అందుకే ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు తెలిపింది. 

 

టెక్నాలజీ సహాయంతో ఆడవారు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వచ్చింది. ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే నేను మంచిదే అని చెబుతాను అంటూ మెహ్రీన్ పేర్కొంది. 

2024-04-30T17:03:43Z dg43tfdfdgfd