భార్య చేతి చెంపదెబ్బలు తిన్న స్టార్ హీరో, షాక్ లో ఫ్యాన్స్.. కారణం ఏంటో తెలుసా..?

సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా.. సంసారం ఓ చదరంగమే. ఎవరికి ఉండే బాధలు వారికుంటాయి. వీటికి సినిమా వాళ్లేమి మినహాయింపు కాదు. దానికి బెస్ట్ ఎక్జాంపుల్ బాలీవుడ్ స్టార్ హీరో.. ఆయన ఏకంగా భార్య చేత చెంపదెబ్బలు తిన్నారట. 

 

ఫిల్మ్ఇండస్ట్రీ అయినా.. కామన్ మ్యాన్ లైఫ్ అయినా.. భార్య భర్తలు, ఫ్యామిలీ బంధాలు.. గొడవలు, ప్రేమలు, ఎమోషన్స్ కామన్. కామన్ మ్యాన్ లైఫ్ లో జరిగేవే.. సెలబ్రిటీల లైఫ్ లలో కూడా జరుగుతుంటాయి. అటువంటి సందర్భాలనే పంచుకున్నాడు బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో.. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్. 

 

ప్రభాస్ తో ముగ్గురు హీరోయిన్ల లవ్ ఎఫైర్...? ఎవరా ముగ్గురు..? నిజమెంత..?

పాన్ ఇండియా హీరోగా.. ప్రయోగాత్మక సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆమీర్ ఖాన్.. సినిమాను ప్రేమించే వారికి పరిచయం కూడా అవసరం లేని పేరు.  బాలీవుడ్ లో  ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సృష్టికర్త ఆమీర్ ఖాన్. హీరోయిజానకి సరికొత్త నిర్వచనం చూపించని హీరో ఆమీర్. కథనే హీరోగా చేసిన ఆయన చేసిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. 

 

శుతీహాసన్ డేటింగ్ లిస్ట్ , స్టార్ క్రికెటర్ తో సహా... 7మంది సెలబ్రిటీలతో ప్రేమాయణం

కథ బలంగా ఉంటే.. సినిమా ప్రేక్షకులనుఅలరిస్తుంది అని నమ్మే వ్యక్తి ఆమీర్ ఖాన్.  వైవిధ్యమైన పాత్రలు, విభిన్న కథలుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఆమీర్ ఖాన్.. సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అమీర్ ఖాన్ చివరిసారిగా లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించారు. ఈ సినిమా తరువాత ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. చెన్నైలో ఉంటున్నారు. అక్కడే హీల్స్ స్టేషన్ లో సెటిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 

బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

 

ఇక ఏది ఏమున్నా మనసులో దాచుకోకుండా మాట్లాడుతాడు ఆమీర్ ఖాన్. తన పర్సనల్ లైఫ్ గురించి కూడా దాచుకోకుండా మాట్లాడేస్తుంటాడు. తాజాగా తాజాగా హిందీ బుల్లితెరపై ఫేమస్ రియాల్టీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు ఆమిర్. ఈ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాలు.. కెరీర్, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. 

 

ఈ సంరద్భంగా ఆ మీర్ ఖాన్.. తన ఫ్యామిలీ లైఫ్ కు సబంధించిన సీక్రేట్ ను వెల్లడించారు. తనను తన  మాజీ భార్య రీనా దత్తా చెంపదెబ్బ కొట్టిందని.. అలాగే చేతిని గట్టిగా పళ్లతో కొరికి తిట్టిందంటూ చెప్పుకొచ్చారు ఆమీర్. రీనా దత్తా తనతో అలా ప్రవర్తించడానికి ఓ పెద్ద కారణం కూడా ఉందని అన్నారు.

 

అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. నా పెద్ద కొడుకు జునైద్ ఖాన్ పుట్టే సమయంలో రీనా ప్రసవ వేదన భరించలేకపోయింది. ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్ళి.. నేను పక్కనే ఉన్నాను. ఆమె బాధతో  అల్లాడిపోతుంది. ఆ టైమ్ లో నాకుఏం చేయాలో అర్ధం కాలేదు. నేను ఆమను కూల్ చేయడానికి.. ట్రై చేశాను. తనతో మాట్లాడుతూనే ఉన్నాను.. ఊపిరి తీసుకో.. రిలాక్స్ గా ఉంటుంది అన్నాను. తను వెంటనే నన్ను గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. 

 

అంతే కాదుగట్టిగా కొట్టి.. నా చేతిని తీసుకుని గట్టిగా కొరికింది. అంత బాధలో ఉన్నప్పుడు నేను మాట్లాడిన మాటలు సిల్లీగా అనిపించి తాను అలా చేసింది.  వెంటనే  ఈ అర్థంలేని మాటలు ఆపు అంటూ నాపై అరిచింది అని అమీర్ ఖాన్  చెప్పుకొచ్చాడు. రీనా బాధను నేను మొదటిసారి చూశాను. బిడ్డ పుట్టినప్పుడు ఆడవారు అనుభవించే బాధను నేను మొదటిసారి చూశాను. అంత బాధను తట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు అన్నారు ఆమీర్. 

 

ప్రసవసమయంలో రీనా పడిన బాధ.. ఆమె ముఖంపై చూశాను.. ఆరోజును నేను ఇప్పటికీ మర్చిపోలేను అన్నారు ఆమీర్. ఆమీర్ ఖాన్ చెప్పిన  ఆమాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక అమీర్ ఖాన్ తో  రీనా దత్తా పెళ్ళి జరిగిన  16 సంవత్సరాలకు వారు  విడాకులు తీసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే కొడుకు, కూతురు ఉన్నారు. రీసెంట్ గా ఐరా ఖాన్ పెళ్ళి ఘనంగా చేశాడు ఆమీర్ ఖాన్.

2024-04-29T03:28:00Z dg43tfdfdgfd