భార్యను చంపి.. ఆ బొమ్మను కొనుక్కున్నాడా?.. అమెరికాలో పోలీసులకు షాకింగ్ కేసు

అది 2019 హాలోవీన్ టైమ్. కాన్సాస్ లోని హేస్‌లో ఉదయం వేళ కాల్బీ ట్రికిల్.. 911కి కాల్ చేశాడు. తన 26 ఏళ్ల భార్య క్రిస్టీన్ ట్రికిల్ ఇంట్లోనే తనకు తాను కాల్చుకుందని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇంటికి వెళ్లి పరిశీలించారు. వారికి కాల్బీపై అనుమానం వచ్చింది. కానీ మూడు రోజుల తర్వాత.. పోలీసులు అది ఆత్మహత్యగానే భావిస్తూ.. కాల్బీని వదిలేశారు. కానీ.. ఎక్కడో వారికి కాల్బీపై అనుమానం అలాగే ఉంది.

ఆర్మీ రిజర్వ్‌కి చెందిన కాల్బీ.. తన భార్య పేరుమీద రెండు ఇన్సూరెన్స్ పాలసీల మనీ పొందాడు. మొత్తం 1 కోటి రూపాయలకు పైనే. రెండ్రోజుల తర్వాత.. ఆ డబ్బులో లక్షన్నర పెట్టి.. మనిషి సైజులో ఉన్న సెక్స్ డాల్ (sex doll) కొన్నాడు. భార్య చనిపోతే ఎవరైనా బాధలో ఉంటారు. కానీ కాల్బీ.. ఆమె చనిపోయిన కొన్ని నెలలకే సెక్స్ డాల్ కొనడం డిటెక్టివ్‌ జోషువాకి అనుమానం కలిగించింది.

కాల్బీ.. తనకు వచ్చిన కోటి రూపాయలను 8 నెలల్లో ఖర్చు పెట్టేశాడు. వీడియో గేమ్స్ ఆడాడు, అప్పులు తీర్చాడు, మ్యూజిక్ పరికరాలు కొన్నాడు. ఇలా రెండేళ్లపాటూ అతను స్వేచ్ఛగా బతికాడు. ఐతే.. పరిశోధకులు.. కేసును మళ్లీ పరిశీలించారు. క్రిస్టీ చనిపోయినప్పుడు అండర్‌వేర్ మాత్రమే కలిగివుంది. ఆమె వాడినట్లుగా చెబుతున్న గన్.. చాలా పెద్దగా ఉంది. అలాంటి దాన్ని వాడి.. స్వయంగా షూట్ చేసుకోవడం కష్టం. ఆమె ముఖంపై గాయాలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. ఆమె చనిపోయిన తర్వాత మొబైల్ అలారం మోగింది. అంటే.. ఆమె చనిపోవాలని అనుకోలేదు. ఉదయం లేచి, పనికి వెళ్లేలా అలారం కూడా పెట్టుకుంది. కాల్బీ.. ఈ కేసు పరిశోధనలో.. పోలీసులకు తాను.. మిడిల్ ఈస్ట్, సెంట్రల్ అమెరికాలో మిలిటరీలో పనిచేశానని చెప్పాడు. నిజానికి అతను విదేశాల్లో అలా పనిచెయ్యలేదని డిటెక్టివ్‌ తేల్చారు. ఇవన్నీ చూశాక.. కాల్బీపై అనుమానాలు పెరిగాయి.

2021 జులై 14న అంటే.. క్రిస్టీన్ చనిపోయిన 21 నెలల తర్వాత.. అతనే హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. 2023 సెప్టెంబర్‌లో కోర్టు విచారణలో.. అతను సెక్స్ డాల్ కొన్న విషయాన్ని సాక్ష్యంగా చెప్పారు. కాల్బీ తల్లి మాత్రం తన కొడుకు నిర్దోషి అంటోంది. భార్య చనిపోయాక అతనికి పీడకలలు వచ్చేవనీ, వాటి నుంచి బయటపడేందుకే ఆ బొమ్మ కొనుక్కున్నాడని చెబుతోంది. ఈ కేసుపై కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది.

2024-04-29T03:02:06Z dg43tfdfdgfd