మంచు విష్ణుకు షాక్ ఇచ్చిన నయనతార..? కన్నప్ప టీమ్ లో లుకలుకలు..?

భారీ బడ్జెట్ తో.. ప్రతిష్టాత్మకంగా మంచ విష్ణు నిర్మిస్తున్నాడు కన్నప్ప సినిమాను. పాన్ఇండియా తారగణంతో సినిమాను ప్రకటించగా..ప్రస్తుతం  టీమ్ లో లుకలుకలు కనిపిస్తున్నట్టుతెలుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..? 

 

కన్న సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కాని.. మూవీపై కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాని.. ఇంట్రెస్టింగ్ విషయాలు కాని వెల్లడికావడంలేదు.. ఆ వచ్చేవి కూడా నిజం కావడం లేదు. అంతే కాదు ఈసినిమాలో నటిస్తున్నారంటూ స్టార్ కాస్ట్ ను ప్రనకటించారు. మరికొందరిపై లీకులిచ్చారు. కొందరు కన్ ఫార్మ్ కాకపోయినా... వాళ్ల పేర్లు కూడా బయటకువచ్చాయి. ఇకతాజాగా ఆ పాత్రలపై చిన్న చిన్నగా క్లారిటీ వస్తోంది. 

 

అంతే కాదు కొన్ని విషయాల్లో ఆడియన్స్ కాస్త డిస్సపాయింట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా.. రీసెంట్ గా తెలిసిన రెండు విషయాలు షాకింగ్ గా అనిపించాయి.  మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న కన్నప్ప లో శివుడిగా  ప్రభాస్ నటిస్తున్నాడు అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. కాని తాజాగా టీమ్ ప్రకటించిన దాని ప్రకారం.. శివుడిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. మరి ప్రభాస్ పాత్రం ఏంటీ అనేది క్లారిటీ లేదు. 

అసలు ఈసినిమాలు ప్రభాస్ నటిస్తున్నారా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది అలా ఉంటే తాజాగా కన్నప్పకు సబంధించిన మరో షాకింగ్ విషయం ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ శివుడు అయితే.. నయనతార పార్వతిగా నటిస్తుంది అనుకున్నారు అంతా. కాని అక్షయ్ ను శివుడిగా ప్రకటించడంతో నయనతార పార్వతి పాత్ర నుంచి తప్పుకున్నట్టు సమాచారం. 

 

 అక్షయ్ కుమార్ తో నటించడం ఇష్టం లేక ఆమె తప్పుకుందన్న రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. నయన్ నటించడం లేదు అని కన్ ఫార్మ్ చేసుకున్న విష్ణు.. వెంటనే ఆమ ప్లేస్ ను కాజల్ తో రీ ప్లేస్ చేసినట్టు సమాచారం. 

అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తూ ఉండగా కాజల్ పార్వతి దేవి పాత్రలో కనిపించబోతుందట . ఇక యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ నందీశ్వరుడు పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్  అవుతోంది. దాదాపు 100 కోట్లకు భారీ బడ్జెట్ తో.. తెరకెక్కుతున్న ఆసినిమా విష్ణు ఇమేజ్ తో కలెక్షన్లు కొల్లగొట్టడం కష్టం. అందుకే  పాన్ ఇండియా స్టార్లను రంగంలోకి దింపుతున్నాడు. 

ప్రభాస్ లాంటివారికి ఈసినిమాలు మంచి క్యారెక్టర్ పడితే..మూవీ రేంజ్ మరో లెవల్లో ఉంటుంది అనడంలో డౌట్ లేదు. ఈ మూవీ కోసం ఆల్మోస్ట్ అన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి కీలక నటులను ఎంపిక చేసుకుంటున్నారు. కొంతమంది పేర్లు అయితే ప్రకటించారు మరి వారిలో కూడా మార్పు ఉంటందా లేదా అనేది చూడాలి. 

2024-04-18T06:00:18Z dg43tfdfdgfd