మంత్రిగా వుండి.. కనీసం 10 మందికి పెన్షన్లు ఇప్పించగలిగారా : సుదర్శన్ రెడ్డిపై కవిత విమర్శలు

ఒకప్పుడు ప్రజల జీవితం చెరువు చుట్టూనే వుండేదన్నారు ఎమ్మెల్సే కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన ‘‘ఊరూరా చెరువుల పండుగ’’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.  అనంతరం కవిత ప్రసంగిస్తూ.. ప్రపంచంలో ఏ చోటికి పోయినా నదీ తీరాల్లోనే మానవ నాగరికత ఫరిడవిల్లిందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగంపై ఎక్కువ ఫోకస్ పెట్టారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల్లో ప్రభుత్వం చేప పిల్లలను వేస్తోందని తెలిపారు. దీని వల్ల నాలుగు లక్షల మందికి ఉపాధి కలుగుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కేసీఆర్ వల్ల లబ్ధి పొందిందని కవిత అన్నారు. 

ఈ ప్రాంతానికే చెందిన సుదర్శన్ రెడ్డి పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖా మంత్రిగా వున్నారని కవిత గుర్తుచేశారు. కానీ ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. కనీసం పది మందికి కూడా కొత్త పెన్షన్లు ఇప్పించలేకపోయారని ఆమె పేర్కొన్నారు. చెరువులు ఎండిపోకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టారని కవిత వెల్లడించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందే 6,20,000 చెరువులను నింపుతున్నట్లు తెలిపారు. ఎండాకాలంలోనూ చెరువులు ఎండిపోవడం లేదన్నారు. 

2023-06-08T09:20:31Z dg43tfdfdgfd