మే10న ప్రియాంక సభను సక్సెస్​ చేయాలి

మే10న ప్రియాంక సభను సక్సెస్​ చేయాలి

కామారెడ్డిటౌన్​ , వెలుగు:  ఈ నెల10న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రియాంక సభను  యూత్​ కాంగ్రెస్​ శ్రేణులు సక్సెస్​ చేయాలని ఆ పార్టీ జిల్లా యూత్​ ప్రెసిడెంట్​మహమ్మద్ ఇలియాస్​ అన్నారు.  సోమవారం పార్టీ ఆఫీసులో యూత్​  లీడర్ల మీటింగ్​ నిర్వహించారు.  ప్రియాంక, రేవంత్​రెడ్డి పాల్గొనే సభ సక్సెస్​పై చర్చించారు.  ప్రెసిడెంట్​ మాట్లాడుతూ..   జిల్లాలోని ఆయా ఏరియాల నుంచి సభకు పెద్ద ఎత్తున యూత్​ తరలించటంపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్​ పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T04:33:29Z dg43tfdfdgfd