రాజకీయ పార్టీలకు విశాల్ మాస్ వార్నింగ్, నేను రాకుండా చూసుకోండంటూ సవాల్..

రాజకీయ పార్టీలకు ఊరమాస్ వార్నింగ్ ఇచ్చాడు స్టార్ హీరో విశాల్. తనను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోవాలని.. ప్రజలకు మంచి చేస్తే తాను రాను అంటే ఘాటు వ్యాక్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే..? 

 

తన తాజా సినిమా రత్నం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు తమిళ స్టార్ హీరో విశాల్. సేలం లోని శక్తి కైలాష్ కాలేజ్ లో విశాల్ తన సినిమా ప్రమోషన్ ఆఈవెంట్ ను నిర్వహించారు. విశాల్ ఈకార్యక్రమానికి రావడంతో.. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యారు. ప్రమోషన్ ఈవెంట్ తరువాత మీడియాతో మాట్లాడిన విశాల్.. సంచలన వ్యాక్యలు చేశారు. 

 

మీడియాకు ఇంటర్వ్యూ లో డిఫరెంట్ కామెంట్లు చేశారు విశాల్.  2026లో  తప్పకుండ ారాజకీయాల్లోకి వస్తాను. అన్నారు విశాల్. నేను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోండి.. ప్రజలకు మంచి చేస్తే.. నేను రావల్సిన అవసరమే లేదు అన్నట్టు మాట్లాడారు విశాల్. పార్టీతో పొత్తు టిక్కెట్ల కేటాయింపు గురించి ఆలోచించడం లేదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పార్టీని ప్రారంభించాలి. 

2026లో రాజకీయాల్లోకి వస్తానని చెప్పాను. ఇప్పటీకీ ఒక్కటే మాట చెపుతున్నా.. నన్ను రాజకీయాల్లోకి రాకుండా చూడాలి అంటే.. ప్రజనలకు మంచి చేుయండి. మంచి చేస్తే నేను అటు వైపు చూడను.. నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నారు విశాల్.  

మీరు ప్రజలకు మంచి చేస్తే మేము మా పనులు మేం చేసుకుంటాము.. మీ జోలికి రాము. కాని తమిళనాడులో లోపాలు లేని చోటు లేదు. తమిళనాడులో అనేక పార్టీలు, జెండాలు ఉన్నాయి. కానీ మంచి ఏమీ జరగలేదు. నేను కొత్త అయినప్పటికీ, నేను ఏమి చేస్తానో అందరూ నాకు చెబుతారు. ఓటరుగా మరియు సామాజిక కార్యకర్తగా నా ఆందోళనను మీకు తెలియజేస్తున్నాను. అన్నారు విశాల్. 

 

డీఎంకే, ఏఐఏడీఎంకే, ఏ పార్టీ అయినా ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాసుపత్రికి వెళ్తుంటారు. ఎంపీల వంటి ఎమ్మెల్యేలు వైద్యం కోసం ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. పన్నులు కట్టిన డబ్బుతో ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యతను పెంచకుండా ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు.

తమిళనాడులో మార్పు రావాలి అని ఆకాంక్షించారు విశాల్. ఇక తమిళనాట యాక్టర్స్ యూనియన్స్ కు సంబంధించిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించాు. ఈ ఏడాది చివరి నాటికి అది పూర్తి అవుతుంది అన్నారు. పెద్దలందరితో చర్చించి నటీనటుల  భవన్ కు విజయకాంత్ పేరు పెట్టే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు.

2024-04-23T10:05:25Z dg43tfdfdgfd