రాష్ట్రపతిని కలిసిన సమంత.. ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసిన రాజ్, డీకే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తర్వాత బాలీవుడ్‌లోనూ చాన్స్‌లు దక్కించుకుంటోంది. ‘పుష్ప’ చిత్రంలో చేసిన ఐటెం సాంగ్‌ కూడా ఇందుకు హెల్ప్ అవుతుండగా.. ఇప్పుడు ‘సిటడెల్’ వెబ్ సిరీస్‌లో (Citadel) నటిస్తోంది. రాజ్ అండ్ డీకే (Raj and DK) రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో తను వరుణ్ ధావన్‌తో (Varun Dhawan) స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇదిలా ఉంటే, తాజాగా ‘సిటడెల్’ టీమ్.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Of India Droupadi Murmu) కలిసింది. ప్రస్తుతం ‘సిటడెల్’ షూటింగ్ సెర్బియాలో (Serbia) జరుగుతుండగా.. రాష్ట్రపతి సైతం అక్కడే ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు భారత రాష్ట్రపతి మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆ దేశానికి వెళ్లగా.. సమంత సహా సిటడెల్ టీమ్ సభ్యులు మర్యాదపూర్వకంగా ద్రౌపది ముర్మును కలిశారు.

రాష్ట్రపతిని కలిసినవారిలో ఫిలిం మేకర్స్ రాజ్ అండ్ డీకే, వరుణ్ ధావన్, సమంతతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. అయితే, రాజ్ అండ్ డీకే ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె కామెడీ సినిమాలంటే ఇష్టం. కానీ మా యాక్షన్ మూవీని చూసేందుకు ట్రై చేస్తానని చెప్పారు’ అంటూ పోస్ట్ చేశారు.

ఇక ‘సిటడెల్’ విషయానికొస్తే.. ఇది పాట్రిక్ మోరన్, రస్సో బ్రదర్స్ రూపొందించిన గ్లోబల్ వెబ్ సిరీస్. యూఎస్ఏ వెర్షన్ ఏప్రిల్ 28న విడుదలైంది. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న ఇండియన్ వెర్షన్‌లో సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

100852019

ఇదిలా ఉంటే.. సమంత రీసెంట్‌గానే టర్కీలో ‘ఖుషి’ షూటింగ్‌ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ షెడ్యూల్ తర్వాత విజయ్ ఇండియా తిరిగొచ్చినప్పటికీ.. సమంత మాత్రం అక్కడే ఉండిపోయింది. తను అటు నుంచే సెర్బియా వెళ్లి ‘సిటడెల్’ టీమ్‌తో జాయిన్ అయ్యింది. కాగా..‘ఖుషి’ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇది కాకుండా సామ్ ‘చెన్నై స్టోరీ’ పేరుతో తెరకెక్కనున్న హాలీవుడ్ మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది తనకు మొట్టమొదటి హాలీవుడ్ ప్రాజెక్ట్ కానుంది.

Read latest Tollywood updates and Telugu News

2023-06-08T16:04:30Z dg43tfdfdgfd