వారాహి పవన్ కళ్యాణ్ ప్రాపర్టీ కాదా..? ఆయన వద్ద ఉన్న లగ్జరీ వెహికిల్స్ కలెక్షన్స్ విలువ ఎంతో తెలుసా?

  పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేశాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న లగ్జరీ వెహికల్స్ డిటైల్స్ షేర్ చేశాడు. 

 

  పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేశాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న లగ్జరీ వెహికల్స్ డిటైల్స్ షేర్ చేశాడు. 

 

పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు. ఆయన ఏప్రిల్ 23న పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన ఆస్తులు, అప్పులు, స్థిర, చర ఆస్తుల వివరాలు అఫిడవిట్ లో పొందుపరిచారు. 

 

ఇక పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న లగ్జరీ వాహనాలు పరిశీలిస్తే... హార్డ్లీ డేవిడ్ సన్ బైక్ ఒకటి ఉంది. దాని ధర రూ. 32.6 లక్షలు అట. బెంజ్ ఆర్ క్లాస్ 350 దీని ధర రూ. 72.9 లక్షలు. మహీంద్రా స్కార్పియో ఎస్ 8 దీని ధర రూ. 13.8 లక్షలు. టాటా యోధ కారు దీని ధర రూ. 9.19 లక్షలు. 

అలాగే బెంజ్ మే బ్యాచ్ ఎస్ క్లాస్ 560 దీని ధర రూ. 2.42 కోట్లు, రేంజ్ రోవర్ స్పోర్ట్ రూ. 5.47 కోట్లు, టయోటా ల్యాండ్ క్రూజర్ రూ. 2.53 కోట్లు, టయోటా వెల్ ఫైర్ రూ. 1.11 కోట్లు, జీప్ వ్రాంగ్లర్ రూ. 71. 54 లక్షలు, రెండు మహీంద్రా స్కారియో ఎస్ 11 వాహనాలు ఉన్నాయి. ఒక్కో కారు ధర రూ. 23.49 లక్షలు.      

 

మొత్తంగా పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న వాహనాల విలువ రూ. 14.01 కోట్లు. కాగా ఈ లిస్ట్ లో ఆయన ప్రచార వాహనం వారాహి లేదు. ఈ క్రమంలో ఆయన యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అది చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్ అని ఎద్దేవా చేస్తున్నారు. 

 

మరి 2024 ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారో లేదో చూడాలి. అక్కడ వైసీపీ తరపున వంగ గీతా బరిలో ఉన్నారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే. మరోవైపు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది... 

2024-04-24T05:22:59Z dg43tfdfdgfd