విజయ్ దేవరకొండ ఇంట్లో ప్రశాంత్ నీల్.. అసలేం జరుగుతోంది?

విజయ్ దేవరకొండ ఇంటికి ప్రశాంత్ నీల్ వచ్చాడనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ మేనేజర్ ప్రశాంత్ నీల్‌తో దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఈ వార్త బయటకు వచ్చింది. విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ ఎందుకు వచ్చి ఉంటాడు? అని అంతా ఆరా తీస్తున్నారు. ఏదైనా సినిమాను ప్లాన్ చేస్తున్నారా? అని అంతా చర్చించుకుంటున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా? అని అనుకుంటున్నారు.

అసలే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 2ని పూర్తి చేయాలి. దాని తరువాత ఎన్టీఆర్ మూవీని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అది పూర్తవ్వాలంటే కనీసం 2026 వరకు అయినా ఆగాల్సి ఉంటుంది. రామ్ చరణ్‌తోనూ ఓ మూవీ ఉంటుందనే రూమర్ వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా ప్రశాంత్ నీల్ వద్ద ఉన్న కమిట్మెంట్లు అన్నీ పూర్తవ్వాలంటే చాలా టైం పడుతుంది. అసలు విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ ఎందుకు వచ్చాడు? సినిమా కోసమేనా? అనే చర్చలు మ ాత్రం ఇప్పుడు ఎక్కువగానే జరుగుతున్నాయి.

విజయ్‌తో ప్రశాంత్ నీల్ సినిమా అనేది గాలి వార్తే అని, అసలు అలాంటిదేమీ లేదని ప్రశాంత్ నీల్ టీం క్లారిటీ ఇచ్చిందట. ఏదో ఇది క్యాజువల్ మీట్ అని, సినిమా చర్చలు జరగలేదని అంటున్నారట. మొత్తానికి విజయ్ దేవరకొండకు ఇలాంటి ఓ మాస్ డైరెక్టర్‌తో ఓ మాస్ సబ్జెక్ట్ పడితే నెక్ట్స్ లెవెల్ ఉంటుంది. పూరి జగన్నాథ్‌ లైగర్ సినిమాతో విజయ్‌కి మాస్ ఇమేజ్ ఇద్దామని ట్రై చేశాడు కానీ అంతగా వర్కౌట్ కాలేదు.

విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ఫ్లాపుతో సతమతం అవుతున్నాడు. లైగర్ డిజాస్టర్ నుంచి ఖుషీ కాస్త ఉపశమనం ఇచ్చింది. మళ్లీ ఈ ఫ్యామిలీ స్టార్ పీడకలగా మారింది. ఇక విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబో అయినా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందేమో చూడాలి. విజయ్ సుకుమార్ కాంబోలో సినిమా అటకెక్కినట్టు సమాచారం.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T12:05:30Z dg43tfdfdgfd