వీరి డప్పు శబ్దానికి చిందులేయాల్సిందే.. అలా ఉంటది మరి వీళ్లతోని..

ఆ ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆనాటి అతిపురాతనమైన ఆ శబ్దం వింటే సాక్షాత్తు భగవంతుడే దిగివస్తాడట మరి. టెక్నాలజీ రోజుల్లో కరెంటుతో కూడిన అనేక డ్రమ్ములు అనేక వాయిద్యాలు వచ్చినప్పటికీ సంస్కృతి, సాంప్రదాయం ప్రకారం చేతిలో ఒక కర్ర ఒక రౌండ్ డప్పు తీసుకొచ్చి అందరూ ఒకేలా శబ్దం వాయిస్తూ అందరి మన్ననలను పొందే శబ్దం అది. టెక్నాలజీ రోజుల్లో సైతం ఆనాటి డప్పు ఇప్పటికీ అందరి మన్ననలను పొందుతుంది. ఇంతకీ ఆ శబ్దం ఏంటి ఆ వివరాలు ఒకసారి చూద్దాం.

ప్రస్తుతం టెక్నాలజీ పేరుతో చేతిలో ఉన్న కర్రతో ఒక్కసారి ఇలా కొట్టామా.. అనేక రకాల శబ్దాలు వినిపించాల్సిందే. ఇలా అనేక రకాల వాయిద్యాలు అందుబాటులో వచ్చినప్పటికీ ఆనాటి వాయిద్యాలు లెక్కేవేరు అంటున్నారు గ్రామీణ ప్రాంతవాసులు. ఏదో కరెంటు ఉంటే లేక నాలుగు గదుల్లో వాయించేది కాదు ఈ వాయిద్యం. ఏకధాటిగా మన దగ్గర కొట్టే సత్తా ఉండాలి గానీ అంతసేపు ఆ చక్కని వాయిద్యం అలా వస్తూనే ఉంటుంది అంటున్నారు కాకినాడ జిల్లా కళాకారులు.

ఇక్కడ ఇడ్లీ తినాలా.. వెయిటింగ్ చేయాల్సిందే.. అంత స్పెషల్ ఎంటంటే..

నిజానికి నాటికాలం నుంచి ఈ డప్పు ఎలా తయారు చేస్తారు. అంటే చనిపోయిన జీవుల చర్మాలతో ఈ డప్పును నాటి కాలంలో తయారు చేసేవారట. అలా తయారు చేసిన ఆ డప్పుపైఒక వేలు పడిందా ఆ వచ్చే రిథం సౌండ్ వర్ణించలేము అనే విధంగా వస్తుంది. ఇక దానికి తగ్గట్టుగా రెండు కర్రలు తీసుకుని ఇక కళాకారులు వాయిస్తూ ఉంటారు. ఇలా వరుసగా ఐదు నుంచి 11మంది డప్పులి వరసగా పెట్టుకుని కొట్టారా ఆ వచ్చే శబ్దం కిలోమీటర్లు పోడువునా వినిపిస్తుంది అంటున్నారు.

ప్రస్తుతం టెక్నాలజీ రోజులు అయినప్పటికీ కాకినాడ జిల్లాలో ఏ శుభ కార్యం అయినా ఎటువంటి ఊరేగింపు అయినా ఈ నాటు డప్పులను పిలుస్తూ ఉంటారు. నిజానికి అక్కడ ఎన్ని వాయిద్యాలు ఉన్నా ఈ నాటు డప్పు కళాకారులు వచ్చికొట్టారా అక్కడ ఉన్న ప్రజలంతా వీరి శబ్దాన్ని చూసేందుకు వస్తుంటారు. ఒక తీయదనం వీరి కొట్టే వాయిద్యంలో వస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. డప్పు కొట్టే విధానంలో కూడా వీరు అత్యంత శబ్దం తక్కువ వచ్చేలా ప్రారంభించి దాన్ని కాస్త పెంచుతుంటారు. ఒకేసారి ఈ వాయిద్యం ఉన్నటువంటి అతి మధురాతి మధురంగా వినసొంపుగా కొడుతుంటారు. తనదైన శైలిలో ఆకట్టుకునే విధంగా డప్పు కళాకారులు తమ డప్పులను వాయిస్తుంటారు.

2024-05-01T10:56:25Z dg43tfdfdgfd