వేములవాడ దవాఖానకు అరుదైన అవార్డు

  • ఎకో ఫ్రెండ్లీలో రాష్ట్రంలో మొదటి స్థానం
  • కాయకల్పలో మూడో స్థానం

వేములవాడ, జూన్‌ 1: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఏరియా దవాఖాన అరుదైన అవార్డును సాధించింది. ఎకో ఫ్రెండ్లీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, కాయకల్ప అవార్డులో మూడో స్థానంలో నిలిచిందని దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రేగులపాటి మహేశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 100 ఏరియా దవాఖానలను మూడంచెల విధానంలో ఎకో ఫ్రెండ్లీ అవార్డుకు ఎంపిక చేస్తారు.

దవాఖానలో రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, విద్యుత్తు వినియో గం, పరిసరాల నిర్వహణ, వ్యర్థాల సేకరణ, ప్లాస్టిక్‌ నిరోధానికి తగిన ప్రాధాన్యత, సి బ్బంది పనితీరు.. ఇలా దాదాపు పది అంశాలను పరిశీలించి వంద మారులు వేస్తారు. ఈ విభాగాల్లో వేములవాడ ఏరియా దవాఖాన రాష్ట్రంలోనే అత్యధికంగా 86.19 మారులు సాధించి ఎకో ఫ్రెండ్లీ అవార్డును దకించుకొని మొదటి స్థానంలో నిలిచిందని వైద్యులు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం రూ.5 లక్షల నగదు బహుమతి కూడా అందజేయనుంది. కాయకల్పలోనూ రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది.

2023-06-02T00:08:18Z dg43tfdfdgfd