శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ .  వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని ఏసీ బస్సులను TSRTC నడుపుతోంది.  హైదరాబాద్ నుంచి  ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి రూ.524, బీహెచ్ఈఎల్  నుంచి రూ.564 టికెట్ ధరను నిర్ణయించింది. 

అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించింది. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

 

©️ VIL Media Pvt Ltd.

2024-04-25T09:02:45Z dg43tfdfdgfd