షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే

షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే

కేరళలో ఘోరం జరిగింది. భార్య గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే కేరళలోని మువట్టుపుజాలో కత్రికుట్టి, జోసెఫ్ ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం. అయినా ఎవరి వద్ద ఉండకుండా సొంతంగా వండుకు తింటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా భార్య కత్రికుట్టి మంచం పాలైంది. గత శుక్రవారం రాత్రి జోసెఫ్ తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు.

 హత్య పై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని రికవరీ చేశారు. భర్త జోసెఫ్ ను అరెస్టు చేశారు.  భార్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జోసెఫ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని విచారణలో తెలిసిందన్నారు. కత్రికుట్టి గత ఆరు నెలలుగా మంచానపడిందని. ఆమె కనీస అవసరాలు కూడా తీర్చుకోవడానికి ఎవరి సహాయం కావాలి కాబట్టి జోసెఫ్ ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడని పోలీసులు తెలిపారు.  

ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు. కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తున్న సమయంలో జోసెఫ్ తన భార్యను హత్య చేసినట్లు సమాచారం. ప్రథమ సమాచార నివేదిక ప్రకారం, తెల్లవారుజామున ఘటన జరిగినట్టు తెలుస్తుంది., ఈ హత్యపై కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. జోసెఫ్ ను అదుపులోకి తీసుకున్నామని, త్వరలోనే అరెస్టును నమోదు చేస్తామని అధికారి తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T14:24:18Z dg43tfdfdgfd