సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు: కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు: కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అనుజ్ థాఫన్(32) పోలీసుల కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు.మే 1న  థాపన్‌ ఆత్మహత్యాయత్నానికి యత్నించగా అతడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు. అయితే అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. కాల్పుల ఘటనలో షూటర్లకు ఆయుధాలు అందించినట్లు అనుజ్‌పై ఆరోపణలు ఉన్నాయి. 

ఏప్రిల్ 14  తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు  సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ నివసిస్తున్న బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఖాన్ కుటుంబం నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోకి ఒక బుల్లెట్ దూసుకుపోయింది.  ఈ ఘటనలో   షూటర్లు విక్కీ గుప్తా , సాగర్ పాల్‌ తో పాటు వీరికి  ఆయుధాలిచ్చారనే ఆరోపణలతో అనుజ్ థాపన్ లను  పోలీసులు ఏప్రిల్ 16న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులందరిపై ముంబై పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ఆఫ్ ఆర్గనైజ్ డ్ యాక్ట్( MCOCA) సెక్షన్లను ప్రయోగించారు.

ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ కు  భద్రత కట్టుదిట్టం చేశారు.   గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నుండి బెదిరింపుల తర్వాత 2022లో సల్మాన్ భద్రతా స్థాయిని వై-ప్లస్‌కి పెంచారు. నటుడికి వ్యక్తిగత తుపాకీని తీసుకెళ్లడానికి కూడా అధికారం ఉంది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-01T10:11:46Z dg43tfdfdgfd