సావిత్రి తాగుడుకి కారణం జెమెనీ గణేష్ కాదా?...సంచలన విషయాలు చెప్పిన సీనియర్ రైటర్

‘సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమిని గణేశనే అని సినిమాలో చూపించారు.జెమినీ గణేషన్ వల్లే ఆమె జీవితం నాశనం అయ్యిందన్నట్లు చెప్తారు. కానీ అసలు నిజం వేరే ఉందంటున్నారు సీనియర్ రచయిత తోటపల్లి మధు.  

మ‌హాన‌టి సావిత్రి గురించి ప్రత్యేకంగా ఎవరూ  ప‌రిచ‌యం చేయనక్కర్లేనటువంటి కీర్తి ఆమె సొంతం. తెలుగ‌మ్మాయి అయిన సావిత్రి మొద‌ట నాట‌కాల‌లో న‌టించి ఆ త‌ర‌వాత చెన్నై చేరి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనా ప్రతిభతో పాటు, ఎంతో క‌ష్ట‌ప‌డి  సావిత్రి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఆనాటి  స్టార్ హీరోల‌కు జోడీగా సినిమాలు చేసింది. అయితే అదే సమయంలో కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సావిత్రి జీవితంలో ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలు కూడా చూసింది.

 జెమిని గ‌ణేషణ్ తో ప్రేమ పెళ్లి త‌ర‌వాత సావిత్రి జీవితం మారిపోయిందని చెప్తూంటారు. అలాగే  ఆమె తన మానసిక బాధల నుంచి ఓదార్పుకై  మ‌ద్యానికి భానిస‌వ్వ‌డం..నిమ్మిన‌వారే దారుణంగా మోసం చేయ‌డంతో చివ‌రిరోజుల్లో సావిత్రి జీవితం దుర్బ‌రంగా మారిపోయిందనేది నిజం. అయితే సావిత్రిని మద్యానికి బానిస చేసింది జెమినీ గణేషన్ కాదని, ఆమెలో ఉన్న లావుగా ఉన్నానన్న ఇన్పీరియార్టీ కాంప్లిక్సే కారణం అంటున్నారు సీనియ‌ర్ ర‌చ‌యిత తోట‌ప‌ల్లి మ‌ధు. ఓ పాపులర్ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేసారు.

తోటపల్లి మధు మాట్లాడుతూ...నేను సావిత్రిగారి మీద వచ్చిన చాలా పుస్తకాలు చదివాను. సావిత్రి గారి గురించి ఆ పుస్తకాల్లో రకరకాల వెర్షన్స్ చెప్తూంటారు. జెమెనీ గణేషన్ రావటంతోనే ఆమె జీవితం నాశనం అయ్యిందన్నట్లు మాట్లాడుతూంటారు.  అయితే అవన్ని నిజం కాదు. ఆవిడ అలా అయ్యిపోవటం కారణం వేరే ఉంది. అప్పటి విషయాలను సావిత్రి గారి గురించి బయిటప్రపంచానికి తెలియని కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసారు. 

మధు మాట్లాడుతూ.. ఆ టైమ్ కు సావిత్రిగారు టాప్ లో ఉంది. బ్రహ్మాండమైన సంపాదన. బాగా ఖర్చు మనిషి. పది పన్నెండు సినిమాలు చేస్తూంటే ప్లో గా వచ్చేస్తూండేది డబ్బు. ఇంట్లోనే కంసాలిని పెట్టి బంగారు నగలు చేయిస్తూండేవారు.అలాగే ఫుడ్ కంట్రోలు ఉండేది కాదు. తిని తిని లావెక్కిపోయారు. తినటం పాటు తాగటం చేయటంతో లావు బాగా పెరిగారు ఆమె.

తను ఆర్టిస్ట్ కాబట్టి లావు అయ్యిపోతున్నాననే భయం, బాథతో మరింతగా తాగేవారు. ఈ లోగా ఓ పర్టిక్యులర్ ఫిల్మ్ పెళ్లి కానుక సినిమా కోసం సావిత్రి గారికి కథ చెప్పారు డైరక్టర్ శ్రీధర్. బ్రహ్మాండమైన కథ...ఆ పాత్ర కోసం నేను సైకిల్ తొక్కాలి నేను సన్నం అవ్వాలి అన్నారామె.  అప్పుడాయన చెప్పారు. అది కాదమ్మా..మీరు వేసేది అక్క పాత్ర. మీ చెల్లెలు క్యారక్టర్ కొత్త అమ్మాయి వేస్తుంది అన్నారు.

ఆ కొత్త అమ్మాయి మరెవరో కాదు..కన్నడ అమ్మాయి బి. సరోజాదేవి అన్నారు. అది విన్న సావిత్రి బాగా అప్సెట్ అయ్యిపోయింది. నేను హీరోయిన్ ని సపోర్టింగ్ యాక్టింగ్ చేయాలా అని బాధపడిపోయారామె. అలా ఆవిడ చేయనండి. బి. సరోజావేవిని హీరోయిన్ గా పెట్టి సినిమా తీసారు. పెద్ద హిట్టైపోయింది. ఆ తర్వాత ఆవిడను దాటి బ్రహ్మాండంగా కెరీర్ లో దూసుకుపోతోంది.

సావిత్రిగారు లావు తో బాధపడుతూ..ఎంత కాలం నేను ఇలా చెట్లు వెనక, పుట్ల వెనక ...మొహం మాత్రమే చూపెడుతూ క్లోజ్ షాట్ లతోనే ఎంతకాలం ఇలా అనే దిగులు పట్టుకుంది. అలా ఇంకా లావు..లావు అయ్యిపోతూనే ఉంది. ఆ డిప్రెషన్ ఉంది ఆమెకి. 

జెమెనీ గణేషన్ విషయానికి వస్తే ఆయన ఒకప్పుడు కమల్ లా గ్లామర్ బోయ్. ఆవిడను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఆయన జెంటిల్మెన్. పిల్లలు ఆస్తులు జాగ్రత్త పరచయం అన్ని చేసింది ఆయనే. ఆయనేదో విలన్..కూర్చపెట్టి తాగించేసాడు .అలాగే ఆయన అప్పుడు బిజీ. ఈవిడ అంత బిజీ కాదు. అక్కడ ఇన్ఫీరియార్టీ ఆమెకు. ఆయన తో హీరోయిన్ లుగా సరోజాదేవి, ఆ తర్వాత కాంచన, ఇలా వరసపెట్టి వెళ్లిపోతున్నారు. సావిత్రమ్మ కెరీర్ మాత్రం అక్కడే ఆగింది,దాంతో గొడవలు అని చెప్పుకొచ్చారు.  

 

ఏదైమైనా   సావిత్రి సినీ కెరియర్ అద్భుతంగా ఉన్నప్పుడు జెమినీ గణేషన్ ఆమెవెంటే ఉన్నాడు. తాను తాగుతూ సరదాగా సావిత్రిని తాగమని అడిగాడని చెప్తారు. అంతకుముందు వరకూ మందు ముట్టని సావిత్రి తర్వాత మందులేకుండా బతకలేని స్థితికి వచ్చేసింది. రానురాను సినిమా అవకాశాలు తగ్గడంతో ఆదాయం తగ్గింది. అంతగా చదువుకోని సావిత్రి అమాయకురాలు. ఆర్థిక లావాదేవీలు ఎలా నిర్వహించాలో తెలియక ఎవరిని పడితే వాళ్లని నమ్మింది. అదే ఆమెకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది అంటారు అప్పటి సీనియర్స్. సావిత్రి వైవాహిక జీవితంలో ఓడిపోయారు. ఆమె జెమినీ గణేష్‌ ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు.  నా అనుకున్న వారంతా మోసం చేశారు. మరోవైపు సినిమాలు నిర్మించి నష్టపోయారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు.

అలాగే తెలుగులో సూపర్ హిట్ ్యిన 'మూగమనసులు' సినిమాను సావిత్రి తమిళంలో నిర్మించాలనుకుంది. అందులో హీరోగా భర్తను సెలెక్ట్ చేసింది. కానీ గణేశన్ అభ్యంతరంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి. తన డబ్బు తన అధీనంలో లేదన్న వాస్తవం అప్పుడు తెలిసొచ్చింది. సినిమా ఆగకూడదన్న పట్టుదలతో పూర్తిచేసి విడుదల చేసింది. 

అయితే ఊహించని విధంగా ఆ సినిమా తమిళంలో డిజాస్టర్ అయ్యింది. అంత చక్కని కథ కలిగిన సినిమాను తమిళులు ఎందుకు ఆదరించలేకపోయారో తెలియదు. ఆర్థిక నష్టం , అప్పులమీద వడ్డీలు .... తన మాట వినలేదన్న కోపంతో జెమినీ గణేశన్ ఇంటికిరావడం మానేశాడు. ఎంతగానో ప్రేమించిన భర్త దూరమవడం ఆమె  జీవితాన్నే మార్చేసింది. పతనం ప్రారంభమైంది. 

ఎన్టీఆర్, ఏన్నార్, రాజ్ కుమార్ లాంటి అగ్రస్థాయి హీరోలకన్నా అప్పట్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న సావిత్రికి చివరి రోజుల్లో చేతిలో చిల్లిగవ్వ లేదు. చివరి దశలో కేవలం 500 రూపాయల అద్దెకు చెన్నపట్నానికి మారింది. ఆ చిన్న ఇంట్లోనే కొడుకుతో గడిపింది.సావిత్రి ఆదాయపన్ను సక్రమంగా చెల్లించకపోవడంతో....నోటీసుల మీద నోటీసులు పంపించారు.

కన్నడ సినిమా షూటింగ్ కోసం బెంగుళూరు వెళ్లిన సావిత్రి తన ఆస్తులన్నీ జప్తు చేసే నోటీస్ వచ్చిందని తెలుసుకుంది. అప్పటికీ రెండుమూడేళ్లుగా  మందు మానేసిన సావిత్రి ఆరోజు హోటళ్లో మళ్లీ తాగడం మొదలెట్టింది. దగ్గర ఎవ్వరూ లేరు. తాగటం మెదలుపెట్టిన తర్వాత ఇక ఆపడం తెలియలేదు. 

 తెప్పించుకున్న ఆహారం తినలేదు. ఆ రాత్రి నిద్రలోకి జారుకున్న సావిత్రి డయాబెటిక్ కోమాలోకి వెళ్లింది.  బక్కచిక్కిపోయి ఎముకలగూడులా మారిన సావిత్రి శరీరంలోంచి ఒక్కో పార్ట్ పనిచేయడం మానేస్తుంటే ఎప్పటికైనా కోలుకుంటుందనే ఆశతో గొట్టం ద్వారా ఆహారం ఎక్కిస్తూ వైద్యులు చేయగలిగినంతా చేశారు.  చెప్పాలనుకున్న చివరి మాటలు చెప్పకుండానే 1981 డిసెంబరు 26 న శాశ్వతంగా వెళ్లిపోయింది. 

 

‘జెమిని గణేశన్‌కు పెళ్లైందని తెలిసి సావిత్రి ఆయన్ను ఇష్టపడ్డారు. వివాహం గురించి తెలిసినప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. గణేశన్‌తో పెళ్లి అనేది జీవితంలో ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయం. జెమినికి జీవితంలో ఉన్న నియమాలు వేరు. కాబట్టి ఆయన్ని పెళ్లిచేసుకుని సావిత్రి తప్పు చేశారు. ఎంజీఆర్‌కు సావిత్రి అంటే ఇష్టమని ఆమెతో ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆయన వారిని బెదిరించేవారని నాకు తెలిసింది. దాంతో ఎంజీఆర్‌పై అందరిలో చెడు అభిప్రాయం కలిగింది. కానీ, ఇదంతా తాను సావిత్రి కోసం చేస్తున్నట్లు ఎవ్వరితోనూ చెప్పలేదట. మరో విషయమేంటంటే.. సావిత్రికి ఎంజీఆర్‌తో కలిసి నటించడం ఇష్టం లేదు.’

 

తరచుగా కృష్ణా లంకల్లోకి వెళ్లి రేగుపండ్లను కోసి తెచ్చుకునేది. ఆ రేగుపండ్లంటే ఆమెకు మహా ఇష్టమట! రేగుపండ్లు, పండుమిర్చి గుజ్జుతో కలిపి చేసిన పచ్చళ్లంటే సావిత్రికి   ఇంకా ఇష్టమని చిర్రావూరులోని ఆమె బంధువులు తెలిపారు. సావిత్రి నటిగా ఎదిగిన తరువాత కూడ నర్సయ్య చిర్రావూరు నుంచి ఈ పచ్చళ్లను తయారు చేయించి మద్రాసు   వెళ్లి సావిత్రికి ఇచ్చి వచ్చేవారట. వీటితోపాటు సాయి పసుపు కొట్టి వజ్రకాయంగా తయారుచేసిన మిశ్రమాన్ని సావిత్రి తనకిష్టమైన మేకప్‌ పేస్టుగా వాడుకునేవారట! సావిత్రి ఐదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిందని అంటారు. సావిత్రిలోని చలాకీతనం ఆమె పెద్దమ్మ దుర్గాంబను బాగా ఆకట్టుకుంది. ఆ రోజుల్లోనే   దుర్గాంబ కృష్ణా జిల్లా మానికొండకు చెందిన కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరిని ప్రేమించి కులాంతర వివాహమాడింది. ఈ జంట విజయవాడలోని విజయాటాకీస్‌ వెనుక వైపు   కాపురముండేవారు.

సావిత్రి తాడేపల్లి మండల్లం చిర్రావూరులో 1937 డిసెంబర్‌ 6న జన్మించారు. తాను పుట్టకముందే తండ్రి గురువయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో చిర్రావూరులో   ఉన్న సావిత్రి పెద్దమ్మ అన్నపూర్ణమ్మ దత్త కుమారుడు నర్సయ్య పిన్నమ్మ సుభద్రమ్మను ఇంటికి తీసుకొచ్చి పెంచి ఆదరించారు.

2024-04-29T03:43:05Z dg43tfdfdgfd