సింహాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం.. ఎప్పుడో తెలుసా..?

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో మే 10వ తేదీన చందనోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. చందనోత్సవం పై జిల్లా కలెక్టర్ భక్తులకు ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించే స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలని, ఇతర కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. 10వ తేదీ ఉదయం మొదటి దర్శనం అనువంశిక ధర్మకర్త, అనంతరం తితిదే నుంచి పట్టువస్త్రాలు సమర్పించే వారికి, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, దాతలకు అంతరాలయ పేర్కొన్నారు.

పొలిటికల్ ప్రొటోకాల్ ఉండబోదని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి `ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టిక్కెట్ల విక్రయ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి నగర పరిధిలోని ఎంపిక చేసిన బ్యాంకుల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, మే నెల 6 లేదా 7వ తేదీ లోపు టిక్కెట్ల విక్రయాల ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అంతరాలయ దర్శనాలను ఒక గంటకే పరిమితం చేశామని తెలిపారు. తర్వాత వచ్చిన వారికి అంతరాలయ దర్శనాలు ఉండబోవని తెలిపారు.

ఈ సమ్మర్ కి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇదే.. ఓ లుక్కేయండి..

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కొండపైకి వాహనాల రాకపోకలను గణనీయంగా తగ్గించాలని, ఆ మేరకు పోలీసు విభాగ అధికారులు ప్రణాళికాయుత చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా కొండ దిగువ నుంచి పైకి తరలించేందుకు, దర్శనం అయిపోయిన తర్వాత కొండ దిగువన దించేందుకు అనువుగా తగినన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎక్కడికక్కడ క్యూలైన్లలో విరివిగా తాగునీటి కేంద్రాలను, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

మరుగుదొడ్లు ఇతర వసతులు సమకూర్చుతున్నట్లు చెప్పారు. విభిన్న ప్రతిభావంతులకు ఆ రోజు సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటలకు దర్శనం కోసం స్లాట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. దేవాదాయ శాఖ అధికారులు ఇతర అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకొని పటిష్ట ఏర్పాట్లు చేసి, చందనోత్సవాన్ని విజయవంతం చేయాలని శ్రీనివాసమూర్తిని కోరారు. భక్తులు పై విషయాలు గమనించి స్వామివారిని దర్శించుకోవాలని తెలియజేశారు.

2024-04-29T10:33:24Z dg43tfdfdgfd