సినిమా ఆఫర్స్ కోసం అలా చేసింది... జబర్దస్త్ యాంకర్ సిరి గుట్టు బయటపెట్టిన కమెడియన్!

సిరి హన్మంత్ గుట్టు బయటపెట్టాడు జబర్దస్త్ కమెడియన్ నూకరాజు. ఆమె సినిమా అవకాశాల కోసం ఏం చేసిందో పబ్లిక్ గా చెప్పేశాడు. షోలో ఉన్నవారందరూ అవాక్కు అయ్యారు. 

 

బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న సిరి హన్మంత్ పాపులారిటీ రాబట్టింది. గతంలో ఆమె పలు షార్ట్ ఫిలిమ్స్ చేసినా, చిత్రాల్లో నటించినా గుర్తింపు రాలేదు. హౌస్లో అమ్మడు ప్రేమాయణం నడిపింది. 

 

తోటి యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్-సిరి హన్మంత్ స్నేహం పేరుతో రొమాన్స్ కురిపించారు. ఒకరి పట్ల మరొకరు చాలా పొసెసివ్ గా ఉండేవారు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, అలగడం, బ్రతిమిలాడుకోవడం, కలిసిపోవడం... ఇలా వాళ్ళ జర్నీ సాగింది. ఇది నచ్చని షణ్ముఖ్ లవర్ దీప్తి సునైన అతనికి బ్రేకప్ చెప్పింది. 

కాగా జబర్దస్త్ నుండి అనసూయ తప్పుకోగా సౌమ్యరావు ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సౌమ్యరావును తప్పించి సిరి హన్మంత్ ని తీసుకొచ్చారు. తెలుగు అమ్మాయి కావడంతో జబర్దస్త్ కమెడియన్స్ పంచ్లకు బాగానే రియాక్ట్ అవుతుంది. 

 

 తాజా ఎపిసోడ్లో నూకరాజు సిరి హన్మంత్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. స్కిట్ లో భాగంగా నూకరాజు అరిగిపోయిన చెప్పులు చూపించాడు. అవి ఎవరివి అనగా... సిరి హన్మంత్ వి అన్నాడు. 

 

ఆఫర్స్ కోసం ఆఫీసులు చుట్టూ తిరిగి తిరిగి ఆమె చెప్పులు అరిగిపోయాయని... పంచ్ వేశాడు. మరి ఆఫర్స్ వచ్చాయా అని అడగ్గా.. లేదు మోకాళ్ళు అరిగాయని మరో పంచ్ వేశాడు. దాంతో సిరి ముఖం మాడ్చుకుంది. 

ఏ నటి అయినా కెరీర్ ప్రారంభంలో చేయాల్సిన పనే ఇది. ఇప్పుడు స్టార్స్ గా ఎదిగిన వారు గతంలో ఫోటోలు పట్టుకొని నిర్మాతలు, దర్శకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉంటారు. నటి కావడం చాలా కష్టం. సిరి హన్మంత్ అందుకు మినహాయింపు కాదు. 

 

కాగా ప్రియుడు శ్రీహాన్ తో కలిసి సిరి ఒక మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. గత ఏడాది విడుదలైన జవాన్ మూవీలో సిరి హన్మంత్ ఒక చిన్న పాత్ర చేయడం విశేషం. కెరీర్ పై ఫోకస్ తో సిరి హన్మంత్ ముందుకు వెళుతుంది. 

2024-05-07T04:28:22Z dg43tfdfdgfd