సినిమా చాన్స్ లకు వచ్చి .. నిర్మాతను నిలువునా దోచేశాడు

సినిమా చాన్స్ లకు వచ్చి .. నిర్మాతను నిలువునా దోచేశాడు

జూబ్లీహిల్స్, వెలుగు​:  సినిమా ఆడిషన్స్​కోసం వచ్చిన ఓ యువకుడు నిర్మాతను  మద్యం  మత్తులోకి దింపి నగలు, నగదు దోచుకెళ్లాడు. జూబ్లీహిల్స్​డీఐ మధుసూదన్​తెలిపిన ప్రకారం.. కృష్ణానగర్​లోని లక్కీ రెస్టారెంట్​బిల్డింగ్ లో శ్రీ భైనేష్​ ప్రొడక్షన్​పేరుతో టి.ఎల్లలు బాబు సినీ ఆఫీస్ ను 3 నెలల కిందట ఓపెన్ చేశాడు. యువకుడు శ్రీకాంత్​(35) ​సినిమాల్లో చాన్స్ ల కోసం వచ్చి ఎల్లలు బాబును కలిశాడు. 

అలా శ్రీకాంత్ తరచూ రావడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఈనెల 1న శ్రీకాంత్​మరోసారి ఆఫీసుకు వచ్చాడు. అతనికి భోజనం తేవాలని ఎల్లలు బాబు చెప్పి పంపించాడు. భోజనంతోపాటు మద్యం కూడా తీసుకొచ్చాడు. ఇద్దరూ మద్యం తాగారు. ఎల్లలు బాబుకు మద్యం ఎక్కువవడంతో మత్తులోకి జారుకున్నాడు. అనంతరం ఎల్లలు బాబు ఒంటిపైన10 తులాల చైన్​, 6 తులాల 3 ఉంగరాలు, రెడో వాచ్​తో పాటు రూ.50 నగదు తీసుకుని శ్రీకాంత్ పారిపోయినట్టు గురువారం బాధితుడి కొడుకు  ప్రవీణ్​ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T01:52:18Z dg43tfdfdgfd