సంగారెడ్డిలో దారుణం.. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య కట్టుకున్న భర్తపై హత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించంది. జిన్నారం మండలం ఊట్ల గ్రామం రాంనగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్సింహులు, యాదమ్మ దంపతులు. దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇవాళ ఉదయం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి లోనైన భార్య యాదమ్మ భర్తపై పెట్రోల్ పోసింది. ఆపై నిప్పటించటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పిల్లల్ని చూసేందుకు వెళ్తే..

ఇటీవల ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పిల్లల్ని చూసేందుకు ఇంటికి వచ్చిన భర్తపై భార్య పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది. వివరాల్లోకి వెళితే.. మదనపల్లె రూరల్‌ రామారావు కాలనీకి చెందిన బాబ్జీకి మదనపల్లెకు చెందిన యాస్మిన్‌తో కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. బాబ్జీ, యాస్మిన్‌కు ముగ్గురు సంతానం. బాబ్జీ స్థానికంగా ఉన్న చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తుండగా.. మనస్పర్థలతో కొంతకాలం నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. వీడిపోయాలని నిర్ణయించుకుని విడాకులకు సైతం అప్లై చేశారు. కోర్టు వీరికి విడాకులు సైతం మంజూరు చేసింది. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.

90221495

అయితే.. మదనపల్లె డ్రైవర్స్‌ కాలనీలో ఉంటున్న యాస్మిన్ ఇంటికి బాబ్జీ వెళ్లాడు. పిల్లలను చూసేందుకు వచ్చానని చెప్పగా.. భార్య, ఆమె కుటుంబ సభ్యులు బాజ్జీని అడ్డుకున్నారు. తన పిల్లలను ఎందుకు చూడనివ్వరంటూ బాబ్జీ ప్రశ్నించగా... యాస్మిన్ కుటుంబ సభ్యులు అతనితో గొడవ పెట్టుకుని పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా.. 108 సిబ్బంది అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మదనపల్లె రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More Telangana News And Telugu News

2023-05-28T05:33:03Z dg43tfdfdgfd