ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు..!

ఆడపిల్ల భారం అనే ధోరణ నుంచి సమాజం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఆడపిలల్లను అదృష్టంగా భావిస్తున్నారు. అయితే ఇంకా కొన్ని చోట్ల లింగనిర్ధరణ పరీక్షలు చేసి ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చిదిమేస్తున్నారు. పుట్టిన తర్వాత కూడా చెత్తకుప్పల్లోనో.. ఆసుపత్రుల్లోనో వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇక ఆడపిల్లల చదువు, పెళ్లి వంటి వాటి కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడం తల్లిదండ్రులకి ఆర్ధిక సమస్యలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యువ జంట వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ గ్రామంలో ఆడపిల్ల పుడితే వారి పేరిట కొంత సొమ్ము డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియల్‌ గ్రామానికి చెందిన ఓ యువ జంట తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. జనవరి ఒకటి 2024 నుంచి గ్రామంలో జన్మించిన ప్రతి ఆడపిల్లకి తమ వంతు సహాయంగా పోస్టుల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఖాతా తెరిచి ఒక్కొక్కరికి రూ. 2 వేల నగదును డిపాజిట్‌ చేయనున్నట్లు చెప్పారు. తమ నిర్ణయంతో ఆడపిల్లకు గౌరవం చేకూరుతుందని దంపతులు రెడ్డిగారి శ్రావణలక్ష్మి, తిరుపతిరెడ్డిలు చెబుతున్నారు. వారి నిర్ణయాన్ని గ్రామస్థులు అభినందిస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుతున్నారు. ‌

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T04:32:19Z dg43tfdfdgfd