హైకోర్టులో హీరోయిన్ డింపుల్ హయాతి పంచాయితీ.. పోలీసులకు కీలక ఆదేశాలు..!

హీరోయిన్ డింపుల్ హయాతి కారు పంచాయితీ హైకోర్టు వరకు వచ్చింది. అయితే.. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వాహనాన్ని తన బీఎం డబ్ల్యూ వాహనంతో ఢీకొట్టిందన్న ఆరోపణలతో ఇటీవల వార్తల్లో నిలిచిన నటి డింపుల్ హయాతి ఆ ఘటనలో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. ఇరువైపులా వాదనలు విని పోలీసులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే.. జూబ్లీహిల్స్ పోలీసులు డింపుల హయాతిపై దాడి లేదా క్రిమినల్ ఫోర్స్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన విషయం విధితమే. కాగా.. పబ్లిక్ సర్వెంట్‌ అయిన రాహుల్ హెగ్డేను విధులు చేయకుండా అడ్డుపడడం, అక్రమ నిర్బంధంలో ఉంచడం లాంటి అంశాలతో పాటు బహిరంగ ప్రదేశాలలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్టు కూడా కేసులు పెట్టారు. కాగా.. తనపై జూబ్లీహిల్స్ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. వాటిని కొట్టేయాలంటూ డింపుల్ హయాతి హైకోర్టును ఆశ్రయించింది.

తన అధికారాన్ని ఉపయోగించి ఐపీఎస్ రాహుల్ హెగ్డే తనపై కేసులు పెట్టించారని డింపుల్ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కోర్టులో వాదనలు కొనసాగాయి. డింపుల్ తన బీఎండబ్ల్యు కారుతో ఐపీఎస్ అధికారి వాహనాన్ని ఢీ కొట్టినట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన వివాదం అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయిందని తెలుపుతూ.. కారును ఢీ కొట్టిన ఫోటోలను ధర్మాసనానికి చూపించారు.

పీపీ వాదనలు విన్న న్యాయస్థానం.. ఒకవేళ విచారణకు పిలవాలి అనుకుంటే 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఈ కేసులో డింపుల్ హయాతికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారని పీపీ వెల్లడించారు. అయితే ఈ కేసులో డేవిడ్ విక్టర్‌కు కూడా 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

100823533

100797852

Read More Telangana News And Telugu News

2023-06-08T07:52:12Z dg43tfdfdgfd