KARTHIKA DEEPAM 2 MAY 07 EPISODE: హోటల్ స్టార్ట్ చేసిన దీప.. బోణీ కొట్టిన కార్తీక్.. ఒక్క టీ రూ.500

Karthika Deepam May 07 Today Episode: దీప వంటలక్క అవతారం ఎత్తింది. అత్త కొట్టిన దెబ్బకి బోరు బోరున ఏడ్చి రోడ్డున పడ్డ దీపకి అండగా నిలిచాడు కడియం. దీపతో కలిసి కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు కడియం. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. 

దీపకి ఊహించని షాక్ ఇచ్చింది అనసూయ అత్త. దీప నా కోడలు కాదు కూతురు.. దీపకి న్యాయం చేస్తానని కొడుకుని నిలదీయడానికి వచ్చి.. రెండో కోడలి ఆస్తిని చూసి ఆమెకి లొంగిపోయింది. న్యాయం చేస్తానని చెప్పిన దీపని బయటకు పొమ్మని మరోసారి రోడ్డునపడేట్టు చేసింది. ఇక ఈరోజు (మే 07) ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. ‘ఇప్పటి వరకూ భర్త చేతిలో మోసపోయిన భార్యనే అనుకున్నాను.. ఇప్పుడు అత్తగారి చేతిలో మోసపోయిన కోడల్ని చేశావ్.. పురిటిలోనే తల్లిపోయింది.. పెంచిన తండ్రి పోయారు.. ఇప్పుడు మీరు కూడా దూరం అయ్యారు.. ఇప్పుడు నాకు నా కూతురు తప్ప ఎవరూ మిగల్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి.. నా కూతుర్ని తీసుకుని ఊరు వెళ్లలేను. అలాగని ఆ ఇంటి వాళ్లపై ఆధారపడలేను.. నాలాంటి బతుకు నా కూతురుకి రాకూడదంటే దాన్ని చదివించాలి.. మంచి స్కూల్‌లో చేర్పించాలి.. నేను ఏదొక పనిచేసి డబ్బు సంపాదించాలి.. కాలం ఎన్ని కష్టాలను ఇచ్చినా నేను ఓడిపోను.. నాకు దారి చూపించు నాన్నా అంటూ భోరున ఏడుస్తుంటుంది దీప. ఇంతలో ఓ పెద్దాయన ఏడుస్తున్న దీప దగ్గరకు వస్తాడు. ‘అమ్మా అని పలకరిస్తూ.. ఏమైందమ్మా.. ఆ కళ్లలో నీళ్లు ఏంటి అని అడుగుతాడు. ఏం లేదు బాబాయ్ అంటూనే కన్నీళ్లను దాచేస్తుంది దీప.నువ్వు కూడా నీడకోసమే వచ్చావా తల్లీ..

దాంతో ఆ పెద్దాయన.. ‘ఈ పట్నం నీడనిచ్చే చెట్టు లాంటిది.. ఉన్న ఊరుని వదిలేసి.. ఈ నీడలో బతకాలని ఎంతోమంది వస్తుంటారు. కానీ ఆ నీడ అందరిపైనా పడదు. నాలాంటి వాళ్లు ఏనాటికైనా నీడ పడుతుందని ఎండలోనే ఎదురుచూస్తున్నాం. నువ్వు కోసం ఆ నీడ కోసమే ఎదురుచూస్తున్నావా? అని అడుగుతాడు. దాంతో దీప.. నేను రావడానికి వేరే కారణం ఉంది బాబాయ్.. కానీ ఇంతకుముందే అనుకున్నా.. నేనూ ఈ నీడలోనే బతకాలని అనుకుంటున్నా’ అని అంటుంది. నీ కళ్లలో నీళ్లు చూస్తేనే అర్ధం అయిపోతుందమ్మా.. ఏదో బాధలో ఉన్నావ్ అనీ.. ఇందా ఈ మంచినీళ్లు తాగు అని నీళ్లు ఇస్తాడు పెద్దాయన.

బాబాయ్ అని పిలిచావ్.. నా కష్టం ఇది తల్లీ

నీళ్లు తాగిన దీప.. ‘బాబాయ్.. నువ్వు కూడా నాలాగే ఇక్కడికి వచ్చావా? అని అడుగుతుంది దీప. అవునమ్మా.. చానాళ్లు అయ్యింది.. ఇక ఇక్కడ బతకలేం అని వెళ్లిపోతున్నాను అని అంటాడు. ఏమైంది బాబాయ్ అని వివరాలు అడుగుతుంది దీప. ‘బాబాయ్ అని పిలిచావ్ కాబట్టి.. నా కష్టాలను పంచుకుంటా తల్లీ’ అని తన కష్టాలను చెప్పడం మొదలుపెడతాడు పెద్దాయన. ‘నా పేరు కడియం. నన్ను కడియం బాబాయ్ అంటారు. నేను ఓ స్థలం అద్దెకు తీసుకుని హోటల్ పెట్టాను. చాలాబాగా నడిచింది. కానీ.. కరోనా తరువాత చాలామంది రావడం మానేశారు.

నీకు నీను ఉన్నాను బాబాయ్.. నేను హోటల్ నడుపుతా

ఈ చుట్టు పక్కల హోటల్స్ ఎక్కువ కావడం వల్ల.. అస్సలు ఎవరూ రావడం లేదు. స్థలానికి అద్దె కూడా కట్టలేని పరిస్థితి. ఇంటి అద్దె కూడా కట్టడం లేదు. అందుకే ఓడిపోయి.. వెళ్లిపోతున్నాను’ అంటూ తన కష్టాలను చెప్పుకుంటాడు కడియం. సరే ఇక నేను వెళ్లొస్తానమ్మా అని కడియం బాబాయ్ వెళ్తుండగా.. ‘ఆగు బాబాయ్’ అని అంటుంది దీప. ‘కష్టాలకు భయపడొద్దు.. ఎదురించి నిలబడు.. నీకు సాయంగా నేను ఉంటాను.. మీపై జాలి పడి కాదు.. నాకు ఉపాధి కావాలి.. మీకు నిలబడటం కావాలి.. నేను చిన్నప్పటి నుంచి హోటల్ వ్యాపారంలోనే ఉన్నాను. హోటల్‌కి సంబంధించిన పనులన్నీ నాకు వచ్చు.. నాకు ఒక్క అవకాశం ఇవ్వు బాబాయ్.

పద బాబాయ్ గెలిచి చూపిద్దాం..

టిఫిన్ల కోసం జనాల్ని మీ హోటల్ ముందు క్యూ కట్టించే బాధ్యత నాది. నాపై నమ్మకం లేదా బాబాయ్ అని అంటుంది. దాంతో కడియం బాబాయ్.. ‘నమ్మకం ఉందమ్మా.. కానీ అన్నీ వద్దనుకుని సర్దేశానే’ అని అంటాడు కడియం. ‘ఏం పర్లేదు బాబాయ్.. ఇది ముగింపు కాదు.. ఆరంభం అనుకుందాం.. ముందు నీ హోటల్ చూపించు.. ఓడిపోవడానికి చుట్టు వంద కారణాలు ఉన్నా.. గెలవడానికి దొరికిన ఒక్క అవకాశాన్ని పట్టుకున్నవాడే జీవితంలో నిలబడతాడని మా నాన్న చెప్పేవారు.. ఆ మాటని మనం నిజం చేద్దాం బాబాయ్’ అని అంటుంది దీప. దాంతో తన హోటల్ దగ్గరకు దీపని తీసుకుని వెళ్తాడు కడియం.

డ్యూటీ ఎక్కేసిన వంటలక్క..

ఇక దీప వంటలక్క అవతారం ఎక్కేస్తోంది. మూలన పెట్టేసి హోటల్ సామాన్లు మొత్తం బయటకు తీసి.. డ్యూటీ ఎక్కేస్తుంది దీప. మొదటిగా తన అనుభవాన్ని మొత్తం రంగరించి టీ పెడుతుంది దీప. సరిగ్గా అప్పుడే జోత్స్న, కార్తీక్‌లు కారులో వెళ్తుంటారు. పద బావా ఏదైనా మంచి కేఫ్‌కి వెళ్లి కాఫీ తాగుదాం అని అంటుంది జోత్స్న. కేఫ్‌లో కాఫీ రొటీన్ జోత్స్నా.. ఏదైనా రోడ్ సైడ్ హోటల్ టీ తాగితేనే కిక్ అని అంటాడు కార్తీక్. దాంతో జోత్స్న సరేనని అంటోంది. ఇక దీప.. టీ పెట్టి.. కడియం బాబాయ్‌ని టేస్ట్ చేయమని ఇష్తుంది.

దీపా మజాకా.. ఇంత రుచిగా ఉంది ఏం కలిపావ్ అమ్మా

వంటలక్క టీ పెట్టడమూ అది బాలేకపోవడమా? నెవ్వర్.. టీ టేస్ట్ చేసిన కడియం బాబాయ్.. అద్భుతంగా ఉందని పొగిడేస్తుంటాడు. ఇంత రుచిగా ఉంది.. ఇందలో ఏం కలిపావ్ అమ్మా అని అడుగుతాడు కడియం. చిన్న చిన్న చిట్కాలు ఉంటాయ్ బాబాయ్ అన్నీ చెప్పకూడదు’ అని అంటుంది దీప. టీ ఇంత చక్కగా పెట్టావ్.. ఎవరైనా కస్టమర్ వస్తే బాగుండు అని అంటాడు కడియం. అలా అన్నాడో లేదో ఇలా కష్టమర్ వచ్చేస్తాడు. ఆ కస్టమర్ ఎవరో కాదు కార్తీక్. రా జోత్స్నా టీ తాగుదాం అని కార్తీక్ అంటే.. నాకు వద్దులే బావా నువ్వు వెళ్లు అని అంటుంది జోత్స్న.

అదిగో తొలి కస్టమర్ వచ్చేశాడు.. రండి బాబూ రండీ

ఏదో టీ షాప్ అని కార్తీక్.. అక్కడ దీప ఉండటం చూసి షాక్ అవుతాడు. కస్టమర్ కోసం ఎదురుచూస్తుంటే.. కార్తీక్ రావడం చూసి దీప షాక్ అవుతుంది. ఇక కడియం అయితే.. కార్తీక్‌కి ఎదురెళ్లి.. రండి బాబూ రండి అని స్వాగతం పలుకుతాడు. ఏం తీసుకుంటారు బాబూ అని అడుగుతాడు.. ఇక దీప కూడా.. కార్తీక్‌ని చూసి.. ఏం కావాలి బాబూ అని అడుగుతుంది. టీ కావాలి? అని కార్తీక్ అడగడంతో.. కార్తీక్‌కి టీ అందిస్తుంది దీప. మొదటి కస్టమర్‌కి నువ్వే నీ చేతులతో టీ ఇవ్వు అమ్మా అని కోరతాడు కడియం. ఆ మాటతో ఫస్ట్ టీని కార్తీక్‌కి ఇస్తుంది దీప.

టీ తీస్కోండి బాబూ..

దీప నుంచి తొలి టీ అందుకున్న కార్తీక్.. ఆమెను అలా చూస్తూ ఉండిపోతాడు. టీ టేస్ట్ చేసి.. సర్ ప్రైజ్ అయిపోతాడు కార్తీక్. టీ చాలా బాగుంది.. చాలా కొత్తగా ఉంది అని అంటాడు కార్తీక్. దాంతో కడియం.. ‘దీపమ్మా మనం పాస్.. ఇవాళే కొత్తగా ఓపెన్ చేశాం.. రేపటి నుంచి టిఫిన్ కూడా స్టార్ట్ చేస్తాం.. రేపు కూడా రండి ’అని అంటాడు. సరేనని అన్న కార్తీక్.. దీప వైపు చూస్తూ.. ‘నువ్వు ఇక్కడ పనిచేస్తున్న విషయం ఇంట్లో వాళ్లకి తెలుసా? అని అడుగుతాడు. దాంతో దీప.. ‘ఎవరికీ చెప్పలేదు’ అని అంటుంది. ఆ మాట విన్న కడియం.. ‘దీపమ్మ మీకు తెలుసా? అని అడుగుతాడు.

​దీప కోసం కావాలనే వచ్చావా? అయిపోయావ్ బావా

అవును మా ఇంట్లోనే ఉంటుంది అని అంటాడు కార్తీక్. ఇంత గొప్పోళ్ల ఇంట్లో ఉంటు నా దగ్గర పనిచేయడం ఏంటమ్మా అని కడియం అడగడంతో.. ‘నా కాళ్లపై నేను నిలబడాలి బాబాయ్’ అని అంటుంది దీప. ఇక జోత్స్న.. కారులో వెయిట్ చేస్తూ.. టీ తాగి రావడానికి ఇంత ఆలస్యమా? అని అటు చూస్తుంది. కార్తీక్ పక్కనే దీప ఉండటంతో.. షాక్ అవుతుంది జోత్స్న. కార్తీక్ కావాలనే దీప దగ్గరకు తీసుకుని వచ్చాడా? కారులో నన్ను కూర్చోబెట్టి దీపతో టీ తాగుతూ కబుర్లు చెప్తున్నావా? ఇందుకా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది? అంటూ కోపంతో ఊగిపోతూ ఉంటుంది జోత్స్న.

దీప కోసం కావాలనే వచ్చావా? అయిపోయావ్ బావా

అంటే.. దీపకి ఉన్న వాల్యూ కూడా నాకు లేదన్నమాట. చెప్తా వీళ్ల సంగతి అని ఆగ్రహంతో ఊగిపోతుంది జోత్స్న. ఇక కార్తీక్.. దీపతో మాట్లాడుతూ.. ‘ఇంటి దగ్గర సౌర్య మీకోసమే ఎదురుచూస్తుంది.. వెళ్దాం రా దీపా’ అని అంటాడు కార్తీక్. ‘లేదు మీరు వెళ్లండి.. నేను తరువాత వస్తాను’ అని అంటుంది దీప. ‘రౌడీ ఎదురుచూస్తుంది.. ఒక్కతే భయపడుతుంది’ అని కార్తీక్ చెప్పడంతో.. ‘కడియం బాబాయ్ నేను మళ్లీ వస్తాను.. నేను మీ దగ్గర పనిచేస్తున్నా.. టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నాం’ అంటూ కార్తీక్‌తో బయల్దేరుతుంది దీప.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T06:48:25Z dg43tfdfdgfd