GUPPEDANTHA MANASU: అనుపమకి క్లాస్ పీకిన వసుధార, మహేంద్ర.. ‘వయసు పెరిగింది కానీ బుద్ది పెరగలేదు’

నీ వల్ల నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను.. సాయం చేయడానికి వచ్చినోడివి చేసి వెళ్లిపోవచ్చు కదా.. ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నావ్.. దూరంగా వెళ్లిపో’ అని కొడుకు మనుతో అంటుంది అనుపమ. దాంతో మను.. ‘వెళ్లిపోతా మేడమ్.. వెళ్లిపోతా.. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోతా’ అని అంటాడు మను. ప్లీజ్ నన్ను వదిలి వెళ్లిపో అని అనుపమ అనడంతో.. ‘ఎక్కడికి మేడమ్ పోయేది’ అంటూ ఎంట్రీ ఇస్తుంది మన హీరోయిన్ వసుధార. ఆమెతో పాటు మహేంద్ర కూడా వస్తాడు కానీ.. డైలాగ్ మాత్రం వసుధారకే. వెళ్లమంటున్నారు ఏంటి మేడమ్.. భోజనం చేసిన తరువాత తనకి వెళ్లాలని అనిపిస్తే వెళ్తారు. లేదంటే ఇక్కడే ఉంటారు అని అంటుంది వసుధార.

అసలు తనని ఇక్కడికి ఎందుకు రానిచ్చావ్ అని కోపంగా అంటుంది అనుపమ. ‘ఏంటి మేడమ్ ఇలా మాట్లాడుతున్నారు.. గాయపడ్డ మిమ్మల్ని చూడ్డానికి వచ్చాడు’ అని అంటుంది వసుధార. ‘తను చేసిన గాయం కంటే.. ఇది పెద్ద గాయం కాదు’ అని అంటుంది అనుపమ. అయినా ఎవరి పర్మిషన్ తీసుకుని నన్ను చూడ్డానికి వచ్చాడు..? ఎవర్ని పడితే వాళ్లని ఎలా రానిస్తారు? అని అంటుంది అనుపమ.

ఆ మాటతో వసుధార.. ‘బిడ్డకి ఆకలేస్తే అమ్మదగ్గరకు ఎలా వెళ్తుందో.. తనకి కూడా మీ దగ్గరకు వచ్చే హక్కు ఉంది మేడమ్.. ఒక బిడ్డకి దాహం వేస్తే అమ్మ దగ్గరకు ఎలా వస్తుంది.. అంటూ పస లేని డైలాగ్‌లు చెప్తుంటుంది వసుధార. ‘ఒక కొడుకుగా తనకి నిద్ర వస్తే మీ ఒడిలో పడుకునే స్వేచ్చ ఉంది మేడమ్.. తనకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా మీతో పంచుకునే అధికారం ఉంది. మీరు దాన్ని ఆపలేరు. అడ్డుకట్ట వేయలేరు మేడమ్’ అని అంటుంది వసుధార.

అది కాదు వసుధార అని అనుపమ అంటే.. ‘మేడమ్ ప్లీజ్.. మను గారు ఇప్పుడు సొంతంగా ఎదిగి ఉండొచ్చు.. తన కాళ్లపై తాను నిలబడే స్థాయికి వచ్చి ఉండొచ్చు.. కానీ ఢిల్లీ రాజైనా తల్లి బిడ్డే’ అని వాట్సాప్ యూనివర్సిటీ డైలాగ్‌లు కొడుతుంది వసుధార. మను ఎక్కడికి వెళ్లినా.. ఎంత దూరం వెళ్లినా.. మను మీ కొడుకే మేడమ్. మర్చిపోవడానికి మీ మధ్య ఉన్నది పరిచయం కాదు.. బంధం... తల్లీకొడుకుల అనుబంధం. ఈ బంధాన్ని మీరే కాదు.. ఆ దేవుడు కూడా చెరపలేరు. ఒక కొడుకుగా మీ బాగోగులు చూడాలనుకోవడం అతని హక్కు మేడమ్. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు’ అని అంటుంది వసుధార.

సూపరమ్మా వసుధార.. చాలాబాగా చెప్పావ్.. నీ మాటలు చూస్తే ముచ్చటేస్తుందమ్మా.. చిన్న వయసులోనే బంధం, అనుబంధం గురించి అర్ధం చేసుకున్నావ్.. కొందరికైతే వయసు పెరిగిన అర్ధం చేసుకునే జ్ఞానం ఉండదమ్మా.. అని అంటాడు. ఆ మాటతో అనుపమ.. ‘మహేంద్రా’.. అని అరుస్తుంది. ‘ఎందుకు అరుస్తున్నావ్.. ఇప్పుడు నేనేం అన్నాను.. నా కోడల్ని మెచ్చుకోవడం కూడా తప్పేనా? అని అంటాడు. ఇంతలో ఏంజెల్ భోజనం రెడీ అందరూ రండి అని పిలుస్తుంది.

వస్తున్నాం.. వస్తున్నాం.. అని అన్న మహేంద్ర.. మను, అనుపమల్ని రమ్మని పిలుస్తాడు. ‘నేను రాను నాకు ఆకలిగా లేదు’ అని అంటుంది అనుపమ. దాంతో మను.. ‘సార్.. నేను ఉంటే తను భోజనం చేయదు.. నేను వెళ్తాను సార్’ అని అంటాడు మను. ‘హే మనూ.. అదేం లేదు నువ్వు ఉండు’ అని అంటాడు. ‘మను ఉన్నాడనే నీకు ఆకలి లేదా?? తను ఇక్కడ భోజనం చేస్తే నీకేం ప్రాబ్లమ్ లేదు కదా’.. అని అంటాడు. మరి అనుపమ సమాధానం ఏంటో రేపటి ఎఫిసోడ్‌లో చూద్దాం.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T09:38:46Z dg43tfdfdgfd