AKSHAYA TRITIYA 2024 అక్షయ తృతీయ వేళ ఈ మంత్రాలను పఠిస్తే.. లక్ష్మీదేవి, కుభేరుని అనుగ్రహం లభిస్తుందట..!

Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వేళ లక్ష్మీదేవి, కుభేర మంత్రాలను పఠించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్బంగా ఏ మంత్రాలను పఠించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Akshaya Tritiya 2024 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10వ తేదీన శుక్రవారం నాడు ఈ పండుగ రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. హిందూ మతంలో ఈ పండుగను కొత్త ప్రారంభానికి చిహ్నంగా, ఆనందం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. అక్షయం అంటే క్షయం లేనిది అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున బంగారంతో పాటు విలువైన ఆభరణాలను కొంటూ ఉంటారు. అయితే ఇలా కొనడం కాదు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. వేదాల్లో అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని ఎక్కడా లేదని పండితులు చెబుతున్నారు. మరోవైపు అక్షయ తృతీయ రోజున ఏదైనా శుభకార్యం ప్రారంభించడానికి ఎలాంటి ముహుర్తం చూడాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా కొన్ని శక్తివంతమైన మంత్రాలను పఠించడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు లోటు అనేదే ఉండదని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా అక్షయ తృతీయ రోజున పఠించాల్సిన మంత్రాలేంటో చూసెయ్యండి...శ్రీ విష్ణుమూర్తి ఆశీస్సుల కోసం..

‘ఓం నమో నారాయణాయః’ ఈ మంత్రం శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది. దీన్ని జపించడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. అంతేకాదు మోక్షం కూడా లభిస్తుంది.​Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వేళ తులసితో ఇలా పూజిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందట..

ఆటంకాలు తొలగిపోవడానికి..

‘ఓం గం గణపతయే నమః’ ఈ మంత్రం వినాయకుడికి అంకితం చేయబడింది. దీన్ని జపించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోయి, పనిలో విజయం చేకూరుతుంది.

ఆర్థిక సమస్యలకు పరిష్కారం కోసం..

‘ఓం మహాలక్ష్మీ నమో నమః, ఓం విష్ణు ప్రియమే నమో నమః’ ఈ మంత్రం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ మంత్రం జపించడం వల్ల ఆదాయం పెరగడమే కాదు.. డబ్బుకు ఎలాంటి లోటు అనేదే ఉండదు.

శివయ్య అనుగ్రహం కోసం..

ఈ మంత్రం గురువుకు అంకితం చేయబడింది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మేధస్సు పెరుగుతుంది. గురువుల నుంచి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. దీంతో పాటు శివుడికి అంకితం చేయబడిన ఈ మంత్రాన్ని జపించాలి. ‘ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్దనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్’ ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆయువు పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.

లక్ష్మీ కుభేర మంత్రాలు..

‘ఓం శ్రీం హ్రీ ఐం కుభేర లక్ష్మీ కమలధారిణ్యై, ధనాకర్షిణ్యై స్వాహా’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల ధనలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందట. దీంతో పాటు ‘ఓం హ్రీం శ్రీం క్రీం కుభేరాయ అష్టలక్ష్మీ మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః’ అనే మంత్రాన్ని కూడా జపించాలి.

అక్షయ తృతీయ మంత్రాల ప్రయోజనాలు..

హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ మంత్రాలలో మీకు నచ్చిన ఏదైనా మంత్రాన్ని జపించొచ్చు. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీ మనసు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండాలని గుర్తుంచుకోవాలి. అదే విధంగా అక్షయ తృతీయ రోజున దానధర్మాలు చేయడం, పూజలు, మంత్రోచ్ఛరణలు పఠించడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, కొత్త ఇల్లు కొనడం, కొత్త వాహనం కొనడం, విద్యాభ్యాసం చేయడం, వివాహం చేసుకోవడం వంటి శుభకార్యాలు కూడా చేయొచ్చు. అంతేకాదు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. మీ ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. సంపదకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అందుకే అక్షయ తృతీయ వేళ ఉదయం, సాయంత్రం ఈ శక్తివంతమైన మంత్రాలను పఠించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.Read Latest Religion News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-09T08:55:51Z dg43tfdfdgfd