ARJUN DAS | బిగ్‌బీతో డైలాగులు షేర్ చేసుకుంటాననుకోలేదు.. కల్కి 2898 ఏడీపై అర్జున్‌ దాస్‌

Arjun Das | గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కాంపౌండ్ నుంచి వచ్చిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) గ్లోబల్ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు పరంపర కొనసాగిస్తుందని తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్‌ జోనర్ ప్రాజెక్ట్‌ జూన్ 27 (గురువారం) ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

ఈ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది కీ రోల్ లార్డ్‌ కృష్ణ. ఈ పాత్రకు ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్‌ (బుట్టబొమ్మ ఫేం) అందించిన వాయిస్‌ ఓవర్‌ మెయిన్‌ హైలెట్‌గా చెప్పొచ్చు. తెరపై లార్డ్‌ కృష్ణగా కృష్ణకుమార్‌ నటనకు ఎంత ఇంప్రెషన్‌ వచ్చిందో.. అంతకు మించి వాయిస్‌ ఓవర్‌కు కూడా మంచి గుర్తింపు వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా కల్కి 2898 ఏడీలో తాను భాగమైనందుకు తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు అర్జున్‌ దాస్‌.

కల్కిలో అవకాశం రావడం గురించి మాట్లాడుతూ.. నాకు కొన్ని వారాల క్రితం స్వప్న ఫోన్ చేసి కల్కిలో శ్రీకృష్ణుడి పాత్రకు డబ్బింగ్ చెబుతావా అని అడిగారు. మమ్మల్ని నమ్మమని అమితాబ్ బచ్చన్‌తో మాట్లాడతానని ఆమె చెప్పే వరకు సంకోచంగానే ఉన్నా. నేను బిగ్‌బీ వీరాభిమానిగా డబ్బింగ్‌ చేయగలనని ఖచ్చితంగా తెలియదు. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత అమితాబ్‌ సర్‌ డబ్బింగ్‌ వాయిస్‌ విన్నాను. ఆయన ఐకానిక్ వాయిస్ విన్నప్పుడు స్కూల్‌లో ఆయన డైలాగ్‌లను అనుకరించిన జ్ఞాపకాలు నాకు తిరిగి వచ్చాయి. సినిమాలో నేను బిగ్‌బీతో డైలాగులు షేర్ చేసుకుంటానని గ్రహించడానికి కొంత సమయం పట్టింది. నన్ను నేను సంగ్రహించుకున్న తర్వాత డబ్బింగ్ ప్రారంభించానంటూ చెప్పుకొచ్చాడు.

మాగ్నమ్‌ ఓపస్‌లో భాగమయ్యే అవకాశమిచ్చిన వైజయంతీ మూవీస్‌, స్నప్నాదత్‌, నాగ్ అశ్విన్‌, ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, కమల్ హాసన్‌తో ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది గొప్ప సత్కారంగా భావిస్తున్నా. మీ దగ్గరలోని థియేటర్లకు వెళ్లి సినిమా చూడండని సూచించాడు అర్జున్ దాస్‌.

Read Also :

Coolie | పాపులర్‌ టెక్నీషియన్‌తో లోకేశ్‌ కనగరాజ్‌.. రజినీకాంత్ కూలీ తాజా వార్త ఇదే

Atlee | అంతకు ముందే గెస్ట్‌ రోల్‌.. కీర్తిసురేశ్‌-అట్లీ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌..!

Kamal Haasan | కమల్ హాసన్‌ ఇండియన్‌ 2కు సూపర్ క్రేజ్‌.. ఐమాక్స్‌ వెర్షన్‌ రెడీ

2024-07-03T11:21:12Z dg43tfdfdgfd