RAHU DOSH రాహువు మహాదశతో మనశ్శాంతి అనేదే ఉండదట..! ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసా...

Rahu Dosh హిందూ మత విశ్వాసాల ప్రకారం, రాహు మహాదశ ఉన్న వారికి మనశ్శాంతి అనేది అసలు ఉండదట. అంతేకాదు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయట. అయితే రాహు దోష నివారణకు ఏ పూజలు చేయాలి.. ఎలాంటి పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Rahu Dosh జ్యోతిష్యం ప్రకారం రాహువు-కేతువులు శని భగవానుడి ఆదేశం ప్రకారం, తాము చేసిన కర్మలకు తగిన ఫలితాలను అనుభవిస్తారు. ఇదిలా ఉండగా..ఎవరి జాతకంలో అయితే రాహువు బలహీన స్థానంలో ఉంటే వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాహువును ఆలోచనలకు అధిపతిగా పరిగణిస్తారు. రాహువు ప్రభావంతో మన బుద్ధి పాడయ్యే అవకాశం ఉంటుందని పండితులు చెబుతారు. రాహువు ఇంద్రియ అవయవాలతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. జ్యోతిష్యం ప్రకారం, రాహువు ఛాయ(నీడ) గ్రహంగా పరిగణిస్తారు. రాహువు మహాదశ ప్రభావంతో తరచుగా ఆందోళనలు, ఆర్థిక పరమైన సమస్యలు, ఇంకా అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ సందర్భంగా రాహువు దోషం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి.. ఏయే పరిహారాలు పాటించాలనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...రాహువుతో ఎదురయ్యే సమస్యలు..

జ్యోతిష్యం ప్రకారం, రాహువు-కేతువు గ్రహాలు చంద్ర లేదా సూర్య యుతిని ఏర్పరుస్తాయి. అంతేకాదు ప్రవమ యోగాన్ని కూడా ఏర్పరుస్తాయి. ఈ యోగం వల్ల చాలా మందికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. మీరు చేసే పనుల్లో ఆటంటకాలు ఎదురవుతాయి. మీరు చేయాలనుకున్న ప్రతి పనిని నాశనం చేయాలని చూస్తారు. అంతేకాదు చిన్న తప్పులకు ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాహువు బలహీన స్థానంలో ఉంటే, పగలు, రాత్రి అశాంతి భయపడుతుంటారు. ఇలాంటి వారికి అస్సలు మనశ్శాంతి అనేదే ఉండదు.​Akshaya Tritiya 2024 ఈసారి అక్షయ తృతీయ వేళ ఎన్ని శుభ యోగాలో తెలుసా... ఈ పర్వదినాన ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట..!

రాహువు ప్రభావం..

రాహువు-కేతువులు శనీశ్వరుని ఆదేశానుసారం మనిషి కర్మలకు తగిన ఫలితాలను పొందుతారు. జ్యోతిష్యం ప్రకారం, రాహువు బలహీన స్థానంలో ఉంటే, అకస్మాత్తుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అనుకోని ప్రమాదాలు ఎదువుతాయి. మీ కుటుంబ జీవితంలో గొడవలు జరగొచ్చు. అయితే రాహువు జాతకంలో బలమైన స్థానంలో ఉంటే ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. అంతేకాదు రాజకీయ, పోలీసు, పరిపాలన, ఇంటిలిజెన్స్ సర్వీస్, సిబిఐ తదితర రంగాల్లో విజయం సాధిస్తారు.

మానసికంగా..

ఎవరి జాతకంలో అయితే రాహువు స్థానం బలహీనంగా ఉంటుందో వారి గోర్లు వాటంత అవే వికారంగా మారిపోతాయి. అలాంటి వ్యక్తులు మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో పాటు అల్సర్, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు కూడా పెరుగుతాయి. రాహువు అశుభ ప్రభావం వల్లే ఇలాంటి సమస్యలు పెరగొచ్చు.

ఆరోగ్య సమస్యలు..

రాహువు ప్రభావంతో ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా తలనొప్పి, గడ్డానికి సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడొచ్చు. అయితే ఊపిరితిత్తులు, చేతులు, కడుపు, పాదాలు, మోకాలు, మూత్రపిండాల తదితర రోగాలపై కేతువు ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అంతేకాదు రాహువు ప్రభావంతో తరచుగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. మగవారికి బట్టతల కూడా రావొచ్చు.

పాటించాల్సిన పరిహారాలు..

* మీ జాతకంలో రాహువు స్థానాన్ని బలంగా మార్చుకునేందుకు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి నుదుటిపై గంధం తిలకాన్ని రాయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.* రాహు బీజ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.* రాహువు ప్రభావం పడకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎప్పుడూ ఖాళీగా కూర్చొవద్దు.* ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండండి. ఏ పని లేకుండా కూర్చుంటే మనసులో ఏవేవో చెడు ఆలోచనలు వస్తాయి.* రాహువు స్థానాన్ని బలపరచుకునేందుకు సరస్వతీ దేవి, దుర్గామతను, హనుమంతుడిని పూజించాలి.* బార్లీ లేదా గింజలను పాలలో కడిగి, వాటిని ప్రవహించే నీటిలో వదిలేయాలి.గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Religion News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-29T09:49:04Z dg43tfdfdgfd