SHANI JAYANTI 2024 శని జయంతి వేళ మీ రాశిని బట్టి ఈ పరిహారాలను పాటిస్తే.. ఏలినాటి శని దోషం తొలగిపోతుందట..!

Shani Jayanti 2024 జ్యోతిష్యం ప్రకారం, శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని జయంతి వేళ కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. ఈ సందర్భంగా మీ రాశి ప్రకారం ఏయే పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Shani Jayanti 2024 జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవ గ్రహాలలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహం శని గ్రహం. శని దేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు సుమారు రెండున్నరేళ్ల సమయం పడుతుంది. పురాణాల ప్రకారం, శని దేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతిగా ఉంటాడు. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అందుకే మన జాతకంలో శని దేవుని స్థానం ఎల్లప్పుడూ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతారు. ఈ నేపథ్యంలో మే 8వ తేదీ బుధవారం నాడు శని జయంతిని జరుపుకోనున్నారు. శని జయంతి వేళ శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోవడమే కాకుండా.. ఏలినాటి శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా శని జయంతి వేళ మీ రాశిని బట్టి ఏయే పరిహారాలను పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...1Aries

వృషభ రాశి(Taurus)..

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శని జయంతి వేళ వృషభ రాశి వారు శని దేవుడిని స్మరించుకుంటూ శని చాలీసా పఠించాలి. శని దేవుని అనుగ్రహం పొందడానికి, కుటుంబంలో సంతోషం పెరిగేందుకు పేదలకు దుప్పట్లు దానం చేయాలి.

మిధున రాశి(Gemini)..

ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. శని జయంతి వేళ మిధున రాశి వారు శని దేవాలయంలో పేదలకు నల్ల బెల్లం, నల్లని వస్త్రాలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుని ఆశీస్సులు పొందడంతో పాటు ఉద్యోగం, వ్యాపారాలలో మంచి విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి(Cancer)..

ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కర్కాటక రాశి వారు శని జయంతి వేళ ఉదయం, సాయంత్రం శని స్తోత్రం పఠించాలి. అదే విధంగా నువ్వులు, నూనె పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుని ప్రభావం తగ్గుతుంది. మీకు ఆహారం, డబ్బుల కొరత ఉండదు.

సింహ రాశి(Leo)..

ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి శని జయంతి వేళ సింహ రాశి వారు హనుమంతుడిని, శని దేవుడిని పూజించాలి. ఈరోజున పుష్య రాగం, ఇనుము, నల్ల నువ్వులు, నీటి కుండ, నల్లగొడుగు తదితర వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

కన్య రాశి(Virgo)..

ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. శని జయంతి వేళ ఉపవాస దీక్షను ఆచరించి, శని దేవాలయంలో శని మంత్రాలను పఠించాలి. అదే విధంగా పాదరక్షలను పేదలకు దానం చేయాలి.​Shani Jayanti 2024 ఈసారి శని జయంతి ఎప్పుడొచ్చింది.. శని దేవుని ఆశీస్సుల కోసం ఏం చేయాలంటే...

తులా రాశి(Libra)..

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శని జయంతి సందర్భంగా శని దేవుని ఆలయంలో నువ్వులు, నూనె సమర్పించాలి. పేదలకు నల్లని వస్త్రాలు, నల్లని నువ్వులు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. వ్యాపారులకు మంచి పురోగతి లభిస్తుంది.

వృశ్చిక రాశి(Scorpio)..

ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. శని జయంతి వేళ హనుమాన్ చాలీసా పఠించాలి. ఈ పర్వదినాన గోమాతకు, శునకాలకు ఆహారం ఇవ్వాలి. అలాగే ఇనుప పాత్రలను దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది.

ధనస్సు రాశి(Sagittarius)..

ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ధనస్సు రాశి వారు శని జయంతి వేళ ఆవనూనెతో దీపారాధన చేయాలి. పసుపు వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి.

మకర రాశి(Capricorn)..

ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి శని జయంతి వేళ శని దేవాలయంలో తైలం సమర్పించాలి. అలాగే శని మంత్రాలను జపించాలి. హనుమాన్ చాలీసా జపించి, గోమాతలను దానం చేయాలి. పేదలకు ఆహారం ఇవ్వడం వల్ల శని సాడేసతి వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. శని దేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T08:15:38Z dg43tfdfdgfd