VARUTHINI EKADASHI 2024 ఈసారి వరూథిని ఏకాదశి ఎప్పుడొచ్చింది... పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి...

Varuthini Ekadashi 2024 తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఛైత్ర మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూథిని ఏకాదశి అంటారు. ఈసారి ఈ ఏకాదశి ఎప్పుడొచ్చింది.. దీని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Varuthini Ekadashi 2024 హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెలలో రెండు సార్లు ఏకాదశి వస్తుంది. ఒకటి శుక్ల పక్షంలో వస్తే.. మరొకటి క్రిష్ణ పక్షంలో వస్తుంది. ఈ ఏకాదశుల్లో కొన్నింటికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అందులో ‘వరూథిని ఏకాదశి’కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువకు అంకితం ఇవ్వబడింది. ఈ పర్వదినాన విష్ణువు వామనావతారాన్ని పూజిస్తారు. వరూథిని ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించడం, దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 4వ తేదీన శనివారం నాడు వరూథిని ఏకాదశి వచ్చింది. ఈ సందర్భంగా దీని విశిష్టతలేంటి.. పూజా విధానం.. శుభ ముహుర్తాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...శుభ ముహుర్తం..

ఈసారి వరూథిని ఏకాదశి తిథి 3 మే 2024 శుక్రవారం రాత్రి 11:24 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం 4 మే 2024 శనివారం రాత్రి 8:28 గంటల వరకు ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం, ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి మే 4వ తేదీన వరూథిని ఏకాదశి జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన శ్రీ మహా విష్ణువు ఐదో అవతారమైన వామనుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు.​Akshaya Tritiya 2024 మీ రాశి ప్రకారం, అక్షయ తృతీయ వేళ వీటిని దానం చేస్తే.. మీ ఇంట కనకవర్షం కురుస్తుందట..!

పూజా విధానం..

* వరూథిని ఏకాదశి వేళ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నీరు ప్రవహించే నదిలో స్నానం చేయాలి. అనంతరం శ్రీ హరికి అభిషేకం చేసి పాలు, తులసి సమర్పించాలి.* శ్రీ మహా విష్ణువును పూజించే సమయంలో బంతి పూలు సమర్పించాలి.* వీటితో పాటు శంఖం, చక్రం, తామరపువ్వు, గద, పసుపు బట్టలు ధరించి తియ్యని పదార్థాలను నైవేద్యం సమర్పించాలి.* విష్ణుమూర్తిని పూజించే సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది.* తులసి చెట్టు ఎదుట నెయ్యి దీపం పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత..

పద్మ పురాణం ప్రకారం, వరూథిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, ఒక వ్యక్తి సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇదే రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల విద్యాదానం ఫలం కూడా లభిస్తుంది. ఈ ఏకాదశి వేళ ఉపవాసం ఉండటం వల్ల పాపాలన్నీ తొలగిపోయి, చివరికి మోక్షం లభిస్తుంది. పేదరికం కూడా తొలగిపోతుందని నమ్ముతారు. మీరు బాధల నుంచి విముక్తి పొందుతారు. వరూథిని ఏకాదశి వేళ తులసి చెట్టును కూడా పూజించాలి. అయితే తులసి ఆకులను పొరపాటున కూడా తెంచరాదు.

ఈ పనులు చేయండి..

* వరూథిని ఏకాదశి రోజున మూగ జీవాలకు అంటే పశువులు, పక్షులకు నీరు, ఆహారం వంటివి అందజేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.* మీ శక్తి, సామర్థ్యం మేరకు ఆహారం, బట్టలు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.* వరూథిని ఏకాదశి వేళ పండ్లను దానం చేయడం వల్ల పదేళ్ల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. * ఏకాదశి తర్వాతి రోజున అంటే ద్వాదశి రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసిన తర్వాత మీరు భోజనం చేయాలి.గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Religion News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-03T07:34:32Z dg43tfdfdgfd