ఇది మనందరి కథ

‘స్కూల్‌ రోజుల్లో 35 మార్కులు నాకు పెద్ద పర్వతంలా అనిపించేవి (నవ్వుతూ). దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నాకు పాఠశాల రోజులు గుర్తొచ్చాయి. మా అమ్మ ఈ కథ విని..ఇది మనందరి కథ..చాలా మంది జీవితం ఇలాగే ఉంటుందని చెప్పింది’ అన్నారు రానా. ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘35 చిన్న కథ కాదు’. నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

కిషోర్‌ ఈమాని దర్శకుడు. రానా, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మాతలు. ఆగస్ట్‌ 15న తెలుగు, తమిళంలో విడుదల కానుంది. తిరుపతి నేపథ్యంలో నడిచే ఈ కథలో నివేదా థామస్‌ తల్లి పాత్రలో కనిపించింది. చదువు అంతగా రాని తమ కుమారుడి జీవితం గురించి తపన పడే తల్లిదండ్రుల కథగా భావోద్వేగభరితంగా టీజర్‌ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రానా..ఇదొక హార్ట్‌టచింగ్‌ స్టోరీ అని, ఇలాంటి కథలు అరుదుగా వస్తాయన్నారు. తాను ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో ది బెస్ట్‌ ఇదని నివేదా థామస్‌ చెప్పింది.

2024-07-03T20:22:42Z dg43tfdfdgfd