Venkatesh | సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. అలాంటి వాటిలో అగ్ర హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబో ఒకటి. వీరిద్దరి కలయిలో గతంలో ఎఫ్-2, ఎఫ్-3 వంటి హిలేరియస్ ఎంటర్టైనర్స్ రూపొందాయి. ఈ హిట్ కాంబినేషన్ మరోమారు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నది. వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, డి.సురేష్‌బాబు కెమెరా స్విఛాన్ చేశారు. హీరో, అతని ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, అతని ఎక్సలెంట్ వైఫ్ నడుమ నడిచే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ ఇదని చిత్ర బృందం పేర్కొంది. ఉప్రేంద లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.
2024-07-03T20:37:30Z dg43tfdfdgfd