ఓ యువకుడి ప్రతీకారం

రక్షిత్‌ అట్లూరి హీరోగా రాధికా శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట సత్య దర్శకుడు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాత. ఆగస్ట్‌ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

ఈ సందర్భంగా బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘యాక్షన్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలబోసిన చిత్రమిది. తనకు జరిగిన అన్యాయానికి ఓ యువకుడు తీర్చుకున్న ప్రతీకారం ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తం. కథలోని భావోద్వేగాలు కదిలిస్తాయి. రాధికా శరత్‌కుమార్‌ పాత్ర కీలకంగా ఉంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. సంగీర్తన విపిన్‌, రాధికా శరత్‌కుమార్‌, చరణ్‌రాజ్‌, కాంచి, రాకెట్‌ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: శరవణ వాసుదేవన్‌, సంభాషణలు: లక్ష్మీ లోహిత్‌ పూజారి.

2024-07-03T19:37:21Z dg43tfdfdgfd