HERO NANI: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నేచురల్ స్టార్ నాని

Hero Nani Supports Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీ గేటు తట్టాలనే ఉద్దేశంతో పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రచారం చేస్తుండగా.. తాజాగా మరో స్టార్ హీరో సపోర్ట్ పవన్ కళ్యాణ్‌కు దక్కింది. నేచురల్ స్టార్ నాని.. పవన్ కళ్యాణ్‌కు మద్దతు పలికారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ హీరో నాని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

‘డియర్ పవన్ కళ్యాణ్ గారు.. మీరు పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కోబోతున్నారు.ఈ రాజకీయ యుద్ధంలో మీరు అనుకున్న విజయం సాధిస్తారని, ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారని సినీ ఫ్యామిలీకి చెందిన సభ్యుడిగా ఆశిస్తున్నా. నాతోపాటు అందరూ మీకు తోడుగా ఉంటారని భావిస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ సర్’ అని నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు.

మరోపైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇప్పటికే హీరో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోలతో పాటుగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, జానీ మాస్టర్ వంటి సెలబ్రిటీలు సైతం ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం ప్రారంభించారు. ఈ మేరకు మంగళవారం చిరంజీవి ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరిగా పుట్టినప్పటికీ.. మంచి చేయాలనే విషయంలో ముందుంటాడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటారని.. కానీ అధికారం లేకుండానే తన సొంత సంపాదనతో కౌలు రైతుల కన్నీళ్లు తుడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చిరంజీవి చెప్పారు. పవన్ కళ్యా్ణ్ తన గురించి కంటే జనం గురించే ఎక్కువగా ఆలోచిస్తారన్న చిరంజీవి.. తను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడే కదా ప్రజలకు కావాల్సిందని చిరంజీవి అన్నారు. జనం కోసం జనసైనికుడు అయ్యాడని.. తను నమ్మిన సిద్ధాంతం కోసం అంకితమయ్యారని అన్నారు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్‌కు ఓటేసి గెలిపించాలని.. పిఠాపురం ప్రజలకు పవన్ అండగా ఉంటారంటూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T07:49:49Z dg43tfdfdgfd