K KAVITHA IN TIHAR JAIL: గొప్పమనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత.. తీహార్ జైలులో ఏంచేసిందో తెలుసా..?

Kalvakuntla kavitha Served Food To Other Female Inmates In Tihar Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.  ఈ క్రమంలో కోర్టు 14 రోజుల పాటు జ్యూడిషీయల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించారు. దీంతో ఆమె ఏప్రిల్ 9 వరకు తీహార్ జైలులోనే ఉండనున్నారు. కవితకు జైలులో మహిళా ఖైదీలతో ప్రత్యేకంగా 6 వ నంబర్ గదిని కేటాయించినట్లు సమాచారం. ఆమెమంగళవారం రాత్రి అన్నంద, పప్పుతో భోజనం చేశారని తెలుస్తోంది. అదే విధంగా తనతో ఉన్న ఇద్దరు  మహిళా ఖైదీలకు కవిత తన చేతితో స్వయంగా ఆహారం వడ్డించారంట.

Read More: Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..

అదే విధంగా జైలులో పుస్తకాలు చదువుతూ, గడిపినట్లు తెలుస్తోంది. కోర్టు ఇదివరకు కవితకు జైలులో ఇంటిభోజనం, బెడ్,పుస్తకాలు,పెన్నులు, ట్యాబ్లెట్లు, తీసుకెళ్లడానికి కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా కస్టడీలో ఉన్న మిగతా ఖైదీలకు ఉండే సౌకర్యాలు కవితకు ఉంటాయని, అడిషనల్ గా ఎలాంటి సౌకర్యాలు ఉండవంటూకూడా పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక కవితకు సంబంధించి మధ్యంత బెయిల్ పిటిషన్ వాదన ఏప్రిల్ 1 న కోర్టులో జరగనుంది. ఇదిలా ఉండగా ఇదే లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఢిల్లీ మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తర్వాత మూడో రాజకీయ నేతగా కవిత ఉన్నట్లుతెలుస్తోంది.

ఇక ఎమ్మెల్సీ కవిత వాదన మాత్రం మరో విధంగా ఉంది. జైలులో పోలీసులు.. ఇంటి భోజనం, పరుపులు, చెప్పులు, దుస్తులు, బెడ్ షిట్స్,బుక్స్, అనుమంతిడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కళ్లజోడు కూడా ఇవ్వట్లేదని, అవసరమైన వస్తువులు సమకూర్చుకునే విధంగా జైలు సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీచేయాలని ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు శనివారం విచారిస్తామని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఈడీ దాడులు తీవ్ర సంచలనంగా మారింది.

Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?

ఇప్పటికే ఈడీ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లను అరెస్టు చేసింది. ఇక తాజాగా,కేరళ సీఎం కూతురు వీణలకు సైతం ఈడీ నోటీసులను పంపింది. వీరితో పాటు... మహువా మోయిత్రా (టీఎంసీ), ఫరూక్ అబ్దుల్లూ (నేషనల్ కాన్ఫరెన్స్, రాజా (డీఎంకే), సొలం(ఎస్పీ), కీర్తికార్ (శివసేన-ఉద్దవ్), సుభాష్‌ (ఆర్జేడీ)లు ఈడీ నోటీసులను అందుకున్న వారిలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావాలనే అపోసిషన్ లీడర్ల గొంతునొక్కేందుకు ఈడీ, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని ఆయా పార్టీనేతలు విమర్శిస్తున్నారు. 

   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-03-28T16:56:18Z dg43tfdfdgfd