10TH RESULTS 2024 MANABADI : తెలంగాణ టెన్త్‌ ఫలితాల్లో నిర్మల్ 99.06 శాతంతో ఫస్ట్‌ ప్లేస్‌.. చివరి స్థానంలో వికారాబాద్‌

TS SSC 10th Results 2024 : సుమారు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 10వ తరగతి ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. TS SSC Results 2024 వివరాలు చెక్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. తాజాగా విడుదలైన తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలురు 89.41శాతం.. బాలికల్లో 92శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో 3,927 స్కూళ్లలో 100శాతం ఫలితాలు వచ్చాయి. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో ఫలితాలు నమోదయ్యాయి.

నిర్మల్ 99.06 శాతంతో మొదటి స్థానంలో ఉంది. వికారాబాద్‌ అత్యల్పంగా 66శాతం ఫలితాలను సాధించినట్టు కార్యదర్శి వెల్లడించారు. ఇక.. 8883 మంది 10జీపీఏ సాధించినట్టు బోర్డు కార్యదర్శి తెలిపారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షల్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించినట్టు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఓవరాల్‌గా ఉత్తీర్ణతలో 91శాతం ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు.

జూన్‌ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు:

జూన్ 3 నుంచి 13వరకు ఉదయం 9.30 నుంచి 12.30వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి ఫలితాలతో విద్యార్ధులు ఒత్తిడికి గురి కావొద్దని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. ఉత్తీర్ణత సాధించలేని వారికి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు. ఫలితాలతో కలత చెందొద్దని సూచించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-30T05:48:30Z dg43tfdfdgfd