10TH క్లాస్ పరీక్షలు రాస్తున్న నటిపై ముచ్చటపడిన నిర్మాత, చుక్కలు చూపించింది.. హీరో సుమన్ కి కూడా షాక్

హీరో సుమన్ టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరో. సుమన్ కొన్ని ఊహించని వివాదాల్లో చిక్కుకోకముందు అనేక అనేక అద్భుత చిత్రాల్లో నటించాడు. సుమన్ కెరీర్ లో మరపురాని చిత్రాల్లో వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార ఒకటి.

హీరో సుమన్ టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరో. సుమన్ కొన్ని ఊహించని వివాదాల్లో చిక్కుకోకముందు అనేక అనేక అద్భుత చిత్రాల్లో నటించాడు. సుమన్ కెరీర్ లో మరపురాని చిత్రాల్లో వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార ఒకటి. సితార చిత్రంలో సుమన్, భానుప్రియ జంటగా నటించారు. 

 

డైరెక్టర్ వంశీ ఎంతో కళాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లెజెండ్రీ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏడిద నాగేశ్వర రావు శంకరాభరణం, సీతా కొక చిలుక, సాగర సంగమం, స్వయం కృషి లాంటి క్లాసిక్ చిత్రాలని నిర్మించారు. హీరోయిన్ల విషయంలో ఆయన చాలా సెలెక్టివ్ గా ఉండేవారట. 

ఒక కథకి ఎలాంటి అమ్మాయి సరిపోతుందో అంచనా వేసేవారట. సితార చిత్రం ఈ ఏడాదికి విడుదలై 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలని పంచుకున్నారు. సితార చిత్రం తెరకెక్కించాలనుకున్నప్పుడు హీరోగా సుమన్ ని ఎంచుకున్నారట. 

సుమన్ కి అప్పటికి ఇంకా క్రేజీ హీరో అనే గుర్తింపు రాలేదు. దీనితో సుమన్ తాము చెప్పిన రెమ్యునరేషన్ కి అంగీకరించాడు. కానీ హీరోయిన్ విషయంలోనే సమస్య వచ్చినట్లు వంశీ తెలిపారు. హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు నిర్మాత ఏడిద నాగేశ్వర రావు హీరోయిన్ రాధ గురించి చెప్పారు. ఆ పిల్ల భలే ఉందయ్యా. మన సినిమాలో రాధని ఎందుకు హీరోయిన్ గా పెట్టకూడదు అని అడిగారట. 

రాధ 10 వ తరగతి చదువుతున్నప్పుడే చూశారట. సీతాకోక చిలుక చిత్రంలో ముందుగా హీరోయిన్ రాధని తీసుకోవాలనిఏడిద నాగేశ్వర రావు ముచ్చటపడ్డారట. కానీ అదే సమయంలో రాధ 10 వ తరగతి పరీక్షలు రాస్తోంది. దీనితో ఆ చిత్రంలో ముచ్చెర్ల అరుణని ఎంచుకున్నారు. 

ఆ తర్వాత మరోసారి సితార చిత్రం సమయంలో రాధ ప్రస్తావన వచ్చింది. ఈ చిత్రం కోసం రాధని సంప్రదించారు. కానీ రాధ ఏకంగా లక్ష రూపాయలు డిమాండ్ చేసి సంచలనం సృష్టించింది. దీనితో నిర్మాత, డైరెక్టర్ షాక్ అయ్యారు. అప్పటికి సుమన్ స్టార్ హీరో కాకపోవడంతో రాధ అంత మొత్తం డిమాండ్ చేసింది.   ఆమె అడిగినంత ఇస్తే ఓవర్ బడ్జెట్ అయిపోతుందని భాను ప్రియని హీరోయిన్ గా తీసుకున్నారు. 

2024-05-09T13:36:34Z dg43tfdfdgfd