20 రోజులు వదిలి ఉండలేకపోయిన నయనతార?

నయనతార ప్రస్తుతం ఫ్యామిలీకి ఎక్కువగా టైం కేటాయిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక విఘ్నేశ్ శివన్ తన సినిమా షూటింగ్ కోసం 20 రోజులు బయటకు వెళ్తే.. పిల్లలతో పాటు నయన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పిల్లలు తమ తండ్రిని 20 రోజులు చూడకుండా ఒక్కసారిగా చూస్తే ఎలా అవుతారో.. నయన్ కూడా అలానే ఎగిరి గంతేసినట్టుగా కనిపిస్తోంది. ఇరవై రోజులు అలా ఓ షెడ్యూల్ కోసం బయటకు వెళ్లినప్పుడు నిన్ను ఎంతగానో మిస్ అయ్యాం.. నిన్ను ఇలా చూడటంతో మేం ముగ్గురం ఎంతో ఆనందంగా ఉన్నామంటూ నయన్ తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

అంటే భర్తను అలా వదిలి నయన్ ఉండలేకపోతోందని తెలుస్తోంది. ఇక పిల్లలు సైతం తండ్రి కోసం బాగానే అల్లరి చేసినట్టు అర్థం అవుతోంది. మొత్తానికి నయన్ మాత్రం ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ను బాగానే ఎంజాయ్ చేస్తోంది. భర్త, పిల్లల ప్రేమతో నయన్ ఎంతో సంతోషంగా ఉందని కనిపిస్తోంది. ఇక ఇప్పుడు నయన్ సైతం సినిమాల కంటే ఫ్యామిలీకే ఎక్కువగా టైం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

]]>

నయన్ ప్రస్తుతం ఎటువంటి కాంట్రవర్సీలను తన నెత్తి మీద వేసుకోవాలని అనుకోవడం లేదు. అందుకే అన్నపూరని మూవీ టైంలో వచ్చిన వివాదానికి వెంటనే ముగింపు పలకింది. తనకు దేవుడంటే నమ్మకమని, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటానని, తాను ఎవ్వరి మనోభావాలను దెబ్బ తీయాలని అనుకోవడం లేదని అన్నపూరణి కాంట్రవర్సీ సన్నివేశాల మీద క్లారిటీ ఇచ్చింది. ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించండి అంటూ నయన్ కోరింది. నయనతార చివరగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించింది. అందులో చిరుకి చెల్లిగా నయన్ నటించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T05:04:57Z dg43tfdfdgfd