AA OKKATI ADAKKU DAY 2 COLLECTIONS: మళ్లీ కామెడీ సినిమాతో నరేష్.. కానీ నవ్వించలేకపోయారుగా..

Aa okkati adakku collections: ఒకప్పుడు కామెడీ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే అల్లరి నరేష్ ఈమధ్య నాంది, ఉగ్రం లాంటి సీరియస్ సినిమాలలోనే కనిపించారు. ఈ సినిమాలు నటుడిగా నరేష్ కి బాగానే పేరుతెచ్చాయి కానీ మళ్ళీ వింటేజ్ అల్లరి నరేష్ ను చూడాలి అని అభిమానులు ఆశపడ్డారు. 

ఫైనల్ గా ఫ్యాన్స్ కి ఊరట ఇవ్వడానికి ఎట్టకేలకి ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ ఒక్కటీ అడక్కు అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ చిత్రం.. ఈ వారం మే3 వ తేదీన థియేటర్లలో విడుదలైంది.  చాలాకాలం తర్వాత అల్లరి నరేష్ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా కావడంతో.. సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. చిత్ర ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో సినిమాకి ఓపెనింగ్ డే కలెక్షన్లు బాగానే వచ్చాయని చెప్పుకోవచ్చు. 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజున 1.6 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుంది. ఇది మరీ అంత ఎక్కువ కాకపోయినా ఒక మోస్తారుగా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. అయితే సినిమాకి ఫస్ట్ డే నే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్ల పై కూడా అది ప్రభావం చూపింది. రెండవ రోజున ఈ సినిమా కలెక్షన్లు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పుకోవాలి. వారాంతం అయినప్పటికీ సినిమా కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. రెండవ రోజున ఈ సినిమా కోటి రూపాయల దాకా కలెక్షన్లను నమోదు చేసుకుంది.

మరి మొదటి వారంతం పూర్తయ్యేసరికి ఈ సినిమా కలెక్షన్లు.. ఎంతవరకు నమోదు అవుతాయో చూడాలి. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో.. వెన్నెల కిషోర్, హర్ష చెముడు, జేమీ లెవర్, అరియానా గ్లోరీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చిలక ప్రొడక్షన్స్ పతాకం పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. మల్లి అంకం ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 

మళ్లీ అల్లరి నరేష్ ని అలరించే పాత్రలో చూడాలన్న అభిమానుల ఆశ నెరవేరింది కానీ సినిమా హిట్ అయితే అయ్యేలాగా కనిపించడం లేదు. దీంతో అభిమానులు కూడా కొంత నిరాశ చెందుతున్నారు.

Also Read: Agra school Principal: వామ్మో.. లేడీ టీచర్ కు చుక్కలు చూపించిన ప్రిన్సిపాల్.. బట్టలు చింపేసి పిడిగుద్దులు.. వీడియో వైరల్..

Also Read: Snake Shed his Skin: బాప్ రే.. కుబుసం విడుస్తున్న పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-05T07:39:24Z dg43tfdfdgfd