AFTER INTER: ఇంటర్ తర్వాత ఈ కోర్సులు పూర్తి చేస్తే.. మీ ఫ్యూచర్ సూపర్!

ఇంటర్ తర్వాత విద్యార్థులకు మంచి మంచి కెరీర్ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత తగిన విధంగా సైన్స్, కామర్స్, ఆర్ట్స్ కోర్సులను ఎంచుకోవచ్చు. ఈ మేరకు అభ్యర్థుల ఆసక్తి, అభిరుచి, వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా అభ్యర్థులు తమ కోర్సులను ఎంచుకోవచ్చు. చాలా మంది విద్యార్థులకు గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు.. ఐతే అలాంటి వారికోసం ఈ కెరీర్గైడ్ మీకోసమే.. ఇకపోతే ఇంటర్మీడియెట్ తరువాత బైపీసీ స్టూడెంట్స్ డాక్టర్ కల నెరవేర్చుకునేందుకు ఎంబీబీఎస్ చేరితే ఫ్యూచర్ మంచి అవకాశం ఉంటుందని అంటున్నారు డాక్టర్ పెంచాల శ్రీనివాస్,శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంక మెడికల్ కుధీటుగా కెరీర్ అవకాశాలను కల్పించే మరెన్నో ప్రత్యామ్నాయ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిపై అవగాహన పొంది తమకు తగిన కోర్సును ఎంచుకుంటే అద్భుత కెరీర్ సొంతమవుతుందన్నారు..

ఇంటర్ తరువాత బీఫార్మసీ, యమ్ ఆఫ్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, అనే మూడు స్థాయిల కోర్సులకు బైపీసీ విద్యార్థులు అర్హులు. బీఫార్మసీ, ఫార్మా-డీకి ఎంసెట్లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇవి పూర్తి చేసుకున్న వారికి కోర్సు స్థాయి ఆధారంగా ఫార్మసీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్ కంపెనీల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి.

రైతులకు అదిరే గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.80 వేలు ఖాయమట!

ఆర్మీ లొ చేరాలనుకునేవారికి ఇండియన్ ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవిలో అకాడమీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష నేషనల్ డిఫెన్స అకాడమీ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థులు ఎంచుకున్న విభాగం ఆధారంగా ఆయా అకాడమీల్లో శిక్షణ ఉంటుంది. ఆర్మీ, ఎయిర్ఫోర్స్ అకాడమీల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బీఎస్సీ,బీఏ డిగ్రీ, నేవల్ అకాడమీలో శిక్షణ పొందిన వారికి బీటెక్ డిగ్రీతో పాటు త్రివిధ దళాల్లోకూడా చేరవచ్చు.

టీవీలో ఎలాంటి రిపేర్ వచ్చినా నో ప్రాబ్లమ్.. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు!

ఇండియన్ ఆర్మీ నిర్వహించే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. అకడమిక్ మెరిట్ ఆధారంగా నిర్వహించే ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. తర్వాత శిక్షణ లభిస్తుంది. దీన్ని పూర్తి చేసుకుంటే.. బీటెక్ డిగ్రీతోపాటు ఆర్మీలో కెరీర్ ప్రారంభించొచ్చట.ఇంటర్ లొ హెచ్.ఈ.సి విద్యార్థులు సాధారణంగా డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ ఎంచుకుంటారు. హెచ్ఎసీ ఫౌండేషన్ భవిష్యత్తులో పలు కాంపిటీటివ్ పోటీ పరీక్షల్లో ముందుండేందుకు ఎంతో ఆస్కారం లభిస్తుంది. అత్యున్నత సివిల్ సర్వీసెస్ నుంచి వీఆర్వో, విఆర్ఎ,వరకూ అన్ని పోటీ పరీక్షల్లోనూ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర సబ్జెక్ట్ ప్రశ్నలు తప్పనిసరిగా ఉండటం.. వాటిని ఇంటర్మీడియెట్, బీఏ స్థాయిలో అధ్యయనం చేసి ఉండటంతో హెచ్ఐసీ విద్యార్థులు ఇందులో కూడా రాణించవచ్చు.. ఇంటర్మీడియెట్ అర్హతతో ఐదేళ్ల లా కోర్సులో అడుగుపెట్టొచ్చు. ఈ లా కోర్సులోనూ కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా ఉంటున్నాయి. దీంతో లా పూర్తి చేసిన అభ్యర్థులు కేవలం న్యాయవాద వృత్తికే పరిమితం కాకుండా కార్పొరేట్ కొలువులు సొంతం చేసుకోవడానికి అవకాశం లభిస్తోంది.

ఇంటర్ తరువాత పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఇంటర్మీడియెట్ కనీస అర్హత. దీంతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రాత పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా కొలువు సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఎన్నో మరెన్నో భవిష్యత్తు సూచించే అవకాశాలు ఇంటర్మీడియట్ తర్వాత చాలా ఉన్నాయి.. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంటర్మీడియట్ తర్వాత మంచి అవకాశాలను కల్పించే ఏర్పాటు చేస్తే సరైన మార్గం ఎంచుకోవచ్చంటున్నారు.

2024-03-29T00:45:12Z dg43tfdfdgfd