AI IN MOVIES: సినిమాల్లో AI మాయ..ముసలి హీరోలు కుర్రాళ్లుగా..అమితాబ్యే కాదు వీళ్లు కూడా..

AI in Movies: సినిమాల్లో AI మాయ..ముసలి హీరోలు కుర్రాళ్లుగా..అమితాబ్యే కాదు వీళ్లు కూడా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగంలో ఓ సంచలనం. ఇటీవల దీని క్రేజ్ మరింత పెరిగింది. AI రంగంలో భారీపెట్టుబడులు పెట్టేందుకు టెక్ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. అయితే, ప్రస్తుతం AI వాడకం సినిమాల్లోనూ పెరిగిపోతుంది. ముసలి వాళ్ళను యంగ్ స్టార్స్ గా చూపించడంలో దీన్ని పాత్ర మరింత అభివృద్ధి చెందుతుంది. 

వివరాల్లోకి వెళితే..లేటెస్ట్గా రిలీజైన కల్కి అమితాబ్ లుక్  వీడియో ఫ్యాన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో అమితాబ్ బచ్చన్  యువకుడిలా మారిపోయాడు.దీంతో సినిమా రిలీజ్ అయ్యాక..ఓ పాతికేళ్లు వెనుకెళ్లిన బిగ్ బి రూపాన్ని చూడడానికి ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే, అమితాబ్ ఒక్కడే కాదు..ఇంతకు ముందు చాలా మంది స్టార్స్  యువకుడిలా కనిపించడానికి టెక్నాలజీని వినియోగించారు. 

షారుక్ ఖాన్ - డంకీ

గతేడాది షారుక్ ఖాన్ నటించిన డంకీ.మూవీలో షారుక్ రెండు విభిన్నమైన పాత్రల్లో..వేర్వేరు కాలాల్లో పోషించాడు. అందులో యువకుడిగా నటించే పాత్ర కోసం డిజిటల్ గా అతని ముఖంలో చాలా మార్పులు చేశారు మేకర్స్.

విజయ్ దళపతి- ది గోట్ 

తమిళ స్టార్ హీరో దళపతి  విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో విజయ్ ని యువకుడిగా చూపించడానికి ఏఐ సాయం తీసుకుంటున్నారు డైరెక్టర్ ప్రభు. 

ఆమిర్ ఖాన్ - పీకే, లాల్ సింగ్ చద్దా

బాలీవుడ్ స్టార్ హీరో..వెర్సటైల్ యాక్టర్ ఆమిర్ ఖాన్ తన రెండు సినిమాల్లో వయసు తక్కువ ఉన్న పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అందులో ఒకటి చైతన్య తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్ధా కాగా..అంతకుముందు పీకే. ఈ మూవీస్ లో  డిజిటల్ టచప్ ద్వారా ఆమిర్ వయసు తగ్గించారు. ఈ టెక్నాలజీ వల్ల స్క్రీన్ పై ఆమిర్ ఖాన్ యువకుడిగా కనిపించి మెప్పించాడు. 

సల్మాన్ ఖాన్ - భారత్ 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మూవీలో యువకుడిలా కనిపించాడు. ఈ సినిమాలో 8 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వరకూ సాగే అతని జీవితంలో పాత్రల కోసం అందుకు తగినట్లే ఏఐ టెక్నాలజీని సల్మాన్ లుక్ మార్చడం కోసం దీన్ని వాడారు. 

హ్యారిసన్ ఫోర్డ్ - ఇండియానా జోన్స్, డయల్ ఆఫ్ డెస్టినీ

గతేడాది 81 ఏళ్ల హ్యారిసన్ ఫోర్డ్ ను ఈ మూవీలోని ఫ్లాష్‌బ్యాక్ సీన్ కోసం తన వయస్సుని మరింత తగ్గించి చూపించారు మేకర్స్. దీనివల్ల అతడు 35 ఏళ్ల కిందట తాను ఎలా ఉండేవాడో అలా చూపించడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T06:58:43Z dg43tfdfdgfd