ALLU ARJUN - TRIVIKRAM: త్రివిక్రమ్ మూవీ కోసం అల్లు అర్జున్ కెరీర్‌లో తొలిసారి అలా..

Allu Arjun - Trivikram: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో ఇప్పటికే మూడు సినిమాలొచ్చాయి. అందులో తొలిసారి వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన 'జులాయి' మూవీ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' మూవీ యావరేజ్‌ టాక్‌తో సరిపెట్టుకుంది. ఇక వీళ్ల కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం 'అల వైకుంఠపురములో' మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు వీళ్ల కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాను ఈ యేడాది నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. 'గుంటూరు కారం' తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఒకవైపు ఈ సినిమాకు సంబంధించిన వర్క్ చేస్తూనే 'రామాయణం' మూవీకి సంబంధించిన తెలుగు స్క్రిప్ట్ వర్క్‌తో పాటు డైలాగ్స్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు త్రివిక్రమ్.

ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి ద్విపాత్రాభియం చేయనున్నట్టు సమాచారం. ఇక పాత్రకు మరో పాత్రకు పూర్తి వేరియేషన్ ఉంటుందని చెబుతున్నారు. అదుర్స్‌లో ఎన్టీఆర్ తరహాలో ఈ డ్యూయల్ రోల్ ఉండబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై క్లారిటీ రానుంది.ఈ చిత్రాన్ని హారికా అండ్  హాసిన క్రియేషన్స్ బ్యానర్‌తో పాటు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అల్లు అర్జున్ విషయానికొస్తే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-30T07:34:45Z dg43tfdfdgfd