APPLYING KAJAL ON BABIES: చిన్న పిల్లల కంటికి కాటుక పెట్టొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Applying Kajal Harmful For Eyes: మన భారతీయ సంస్కృతిలో చాలా మంది పుట్టిన పిల్లలకు ముఖం, కళ్ళకు కాటుకను పెట్టడం సాధారణ ఆచారంగా వస్తుంది. దీని వల్ల పిల్లలకు ఇతరుల చెడు దృష్టి నుంచి రక్షణ కలుగుతుందని వారు నమ్ముతారు. కొంతమంది నల్ల గాజులు కూడా వేస్తారు. అయితే చాలా మందికి పిల్లలకు కాటుక పెట్టడం వల్ల నిజంగా సురక్షితంగా ఉంటుందా? లేదా అనే అనుమానం కలుగుతుంది. అయితే దీనికి నిపుణులు ఏమంటున్నారు అంటే..

డాక్టర్లు, పరిశోధకులు పిల్లల కళ్ళకు కాటుక పెట్టడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో లభించే చాలా కాటుకలు, ఐలైనర్స్ రసాయనాలతో తయారు చేయబడతాయి. చిన్న పిల్లల కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ రసాయనాలు వారి కళ్ళకు హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. పిల్లల కళ్లకు కాటుక పెట్టడం వల్ల కళ్ళు పెద్దగా అవుతాయని చూపు మెరుగుపడుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ పిల్లల కళ్లకు కాటుక పెట్టడం వల్ల అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.

కాటుక పెట్టడం వల్ల కలిగే  ప్రమాదాలు:

కంటి ఇన్ఫెక్షన్లు: కాటుకలోని రసాయనాలు కళ్ళలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.

కళ్ళు ఎర్రబడటం, దురద:  చాలా మంది పిల్లలకు కాటుక వల్ల కళ్ళు ఎర్రబడటం, దురదగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి.

కళ్ళు తరచుగా వెళ్లడం: కాటుక వల్ల కళ్ళు తరచుగా వెళ్లడం, నీరు కారడం వంటి సమస్యలు కూడా రావచ్చు.

చర్మ సమస్యలు: కాటుకలోని రసాయనాలు చర్మానికి హాని కలిగించి దద్దుర్లు, చికాకు వంటి సమస్యలకు దారితీస్తాయి.

పరిష్కారం:

పిల్లల కళ్ళకు ఎటువంటి కాటుక, ఐలైనర్స్ వాడకూడదు.

పిల్లల కళ్ళు శుభ్రంగా ఉంచడానికి శుభ్రమైన నీటితో తుడవండి.

పిల్లల కళ్ళకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి చిట్కాలు:

మీ చేతులు శుభ్రంగా లేకపోతే, మీరు మీ పిల్లల కళ్ళను తాకినప్పుడు వారికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లల కళ్ళు శుభ్రంగా ఉంచండి కళ్ళు మురికిగా లేదా దుమ్ముతో నిండి ఉంటే, శుభ్రమైన, తడిసిన వస్త్రంతో తుడవంతి. సూర్యరశ్మి నుండి మీ పిల్లల కళ్ళను రక్షించడానికి UV రక్షణ ఉన్న సన్‌గ్లాసెస్ వాడండి.మీ పిల్లల కంటి ఆరోగ్యాన్ని నిర్ధారించుకోవడానికి వారికి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించండి.

చివరగా, మీ పిల్లల కళ్లకు కాటుక పెట్టడం మంచిది కాదని గుర్తుంచుకోండి. ఇది వారి కళ్లకు హాని కలిగిస్తుంది. అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. మీ పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి, పైన పేర్కొన్న చిట్కాలను అనుసరించండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-04T08:52:44Z dg43tfdfdgfd