ASHLEIGH GARDNER: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్

Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్

ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ ఆష్లీ గార్డ్‌న‌ర్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. తన ప్రేయసి మోనికా రైట్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అందుకు సంబందించిన ఫొటోల‌ను గార్డ్‌న‌ర్ సోష‌ల్‌మీడియా వేదిక‌గా పంచుకుంది. 2021 నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. మూడేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చిన ఈ జంట.. ఇప్పుడు తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించారు. కొత్త జంట‌కు అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.

బ్రిడ్జెట్ ప్యాటెర్‌స‌న్‌‌తో బ్రేకప్

గార్డ్‌న‌ర్‌ మొదట.. సౌత్ ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ బ్రిడ్జెట్ ప్యాటెర్‌స‌న్‌తో ప్రేమాయణం నడిపింది. కొన్నాళ్లకు వీరి బంధం పెటాకులవ్వగా. .అప్పటినుంచి మోనికాతో చ‌నువు పెంచుకుంది. గ‌త మూడేళ్లుగా వీరు త‌మ స‌న్నిహిత ఫొటోలను ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్వహించిన 'క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్' వేడుక‌లోనూ ఈ జంట త‌ళుక్కుమ‌న్నారు.

గుజ‌రాత్ జెయింట్స్‌

గార్డ్‌న‌ర్ ఆస్ట్రేలియా టాప్ ఆల్ రౌండర్లలో ఒకరు. 2017లో ఆసీస్ తరఫున అరంగేట్రం చేసిన ఆష్లీ. .అతి తక్కువ కాలంలోనే కీలక ప్లేయర్‌గా మారింది. గత ఏడేళ్లలో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించగల గార్డ్‌న‌ర్ డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ జెయింట్స్ జట్టు సొంతం చేసుకుంది. ఆమె కోసం రూ. 3.20 కోట్ల భారీ ధర వెచ్చించింది.

©️ VIL Media Pvt Ltd.

2024-04-20T08:16:15Z dg43tfdfdgfd