BALAKRISHNA: వాయిదాపడబోతున్న బాలకృష్ణ సినిమా.. రవితేజ సినిమాకి ఎసరు పెట్టేసారు !

Balakrishna Upcoming Movie: ఈ మధ్యనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఫేమ్ కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఎన్నికల వల్ల ఈ సినిమా నుంచి బాలయ్య బ్రేక్ తీసుకున్నారు. 

వచ్చే నెల 13వ తేదీ దాకా బాలకృష్ణ బిజీగానే ఉండబోతున్నారు. కాబట్టి ఈ లోపు సినిమా షూటింగ్లో బాలయ్య రాలేరు కాబట్టి చిత్ర బృందం మిగతా పనులను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా పూర్తిచేస్తోంది. అంతేకాకుండా తదుపరి షెడ్యూల్స్ కి సంబంధించిన ప్లాన్లు కూడా చేస్తూ బిజీగా ఉంది. 

ఈ సినిమాని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ వారు బాలకృష్ణ సినిమా ఈ ఏడాది విడుదల అయిపోతుంది అనుకొని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రవితేజ భాను భోగ వరపు కాంబినేషన్లో వస్తున్న సినిమాని దింపనున్నారు సినిమా అనౌన్స్ చేసినప్పుడే విడుదల గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు.

కానీ బాలకృష్ణ సినిమా ఇప్పుడు వాయిదా పడేలాగానే కనిపిస్తోంది. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా కొన్ని పెద్ద సినిమాలు డేట్ లు కూడా బ్లాక్ చేసుకొని కూర్చున్నాయి.  ఓజి, దేవర, పుష్ప 2, భారతీయుడు 2, కంగువా, సరిపోదా శనివారం, గేమ్ ఛేంజర్ వంటి సినిమాలు ఈ ఏడాది క్యూ కట్టేసాయి. 

ఇన్ని సినిమాల మధ్యలో బాలయ్య 109 కి మంచి డేట్ కుదరడం కష్టమైన విషయమే. కాబట్టి బాలకృష్ణ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వాలి. కాకపోతే దాని కోసం రవితేజ సినిమా విషయంలో సితార వారు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. మరి సితార వారు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

2024-04-20T07:13:49Z dg43tfdfdgfd