BARRELAKKA MARRIAGE: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్‌ మీడియా అతిథులు

Barrelakka Marriage: నిరుద్యోగంపై బర్రెలతో వీడియో తీసి నెట్టింట్లో హల్‌చల్‌ చేసి అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష వివాహం చేసుకుంది. గతంలోనే పెళ్లయి భర్తతో విడాకులు తీసుకున్న ఆమె తాజాగా తనకు పరిచయం ఉన్న యువకుడిని రెండో పెళ్లి చేసుకుని జీవితంలో కొత్త అడుగులు వేసింది. తన జీవితంలో జరిగిన చేదు ఘటనలను మరచిపోయి కొత్త జీవితం మొదలుపెట్టింది.

Also Read: Barrelakka Husband: బర్రెలక్కకు కాబోయే భర్త ఇతడే.. త్వరలోనే పెళ్లి

 

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్ నియోజకర్గం పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన కర్నె శిరీష బర్రెలక్కగా అందరి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. గతేడాది అసంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలోనూ కీలక అడుగు వేసింది. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలోని ఓ ప్రవేయిట్ ఫంక్షన్ హల్లో గురువారం బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష వివాహం చేసుకుంది. పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన వెంకటేశ్‌తో ఆమె మూడు ముళ్లు వేయించుకుంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాట యూట్యూబ్ తదితర సోషల్‌ మీడియా స్టార్లు పాల్గొన్నారు.

Also Read: Parliament Elections: బర్రెలక్క మరో సంచలనం.. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి సై?

సోషల్‌ మీడియాలో బర్రెలక్క పెళ్లి వార్త హల్‌చల్‌ చేస్తోంది. కొన్ని రోజుల కిందట నిశ్చితార్థం అంటూ బర్రెలక్క తన సోషల్‌ మీడియాలో ప్రకటించినప్పటి నుంచి ఈమె వార్త ట్రెండింగ్‌లో ఉంది. నిశ్చితార్థం, పెళ్లి పత్రిక, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, పసుపు వేడుక తదితర విషయాలను ఆమె ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లతో పంచుకుంటోంది. గతాన్ని మరచి సంసార జీవితాన్ని నిండునూరేళ్లు పొందాలని వచ్చిన అతిథులతోపాటు సోషల్‌ మీడియాలో నెటిజన్లు దీవిస్తున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి లోక్‌సభ ఎన్నికల్లో కూడా బర్రెలక్క పోటీ చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం. పెళ్లి అనంతరం ఆమె నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ ఎంపీగా ఆమెను పోటీ చేయించుకునేందుకు పలు సంఘాలు, మేధావులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-03-28T14:16:28Z dg43tfdfdgfd